Nag Ashwin : ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న నాగ్ అశ్విన్ రీసెంట్‌గా కల్కి 2898 ఏడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే ఈ మూవీ ఇప్పటికే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నాగ్ అశ్విన్ తాజాగా కల్కి సెట్ లో మీడియా మీట్ నిర్వహించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. చిత్రంలో హీరో ప్రభాస్ కాబట్టి ఆయనే కల్కిగా కనిపిస్తారని అందరూ భావించారు. కానీ సినిమాలో ప్రభాస్ ను బౌంటీ హంటర్ భైరవగా చూపించి, క్లైమాక్స్ లో కర్ణుడిగా ప్రెజెంట్ చేసారు. దీంతో కల్కిగా ఏ హీరో కనిపిస్తారని అందరూ ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్ ను అడగ్గా.. ”కల్కి ఇంకా కడుపులోనే ఉన్నారు. అప్పుడే క్యాస్టింగ్ వరకూ వెళ్ళలేదు. దానికి ఇంకా చాలా టైం ఉంది” అని సమాధానమిచ్చారు.
సినిమాలో ప్రభాస్ పాత్ర నిడివి చాలా తక్కువయిందని టాక్ వినిపించింది అన్న సమాధానానికి దర్శకుడు రెండో పార్టులో ఎక్కువ ఉంటుంది అని చెప్పారు.ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి చాలామంది ప్రేక్షకులకి అర్థం కాలేదు. సినిమా కూడా చాలా నెమ్మదిగా సాగుతూ ఉండటంతో ప్రేక్షకులకి కొంచెం బోర్ కూడా కొట్టింది అనే వార్తలు వినిపించాయి. అదే విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఒప్పుకున్నారు. కాంప్లెక్స్ లో సన్నివేశాలని కొంచెం వేరేగా చూపిస్తే నిడివి తగ్గి ఉండేదని చెప్పారు. ఆ విమర్శని నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను అని చెప్పారు నాగ్ అశ్విన్.
విజయ్ దేవరకొండ అర్జున పాత్ర గెస్ట్ రోల్ కాదు, సెకండ్ పార్ట్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ లో నాని, నవీన్ పోలిశెట్టి కూడా గెస్ట్ పాత్రల్లో కనిపించొచ్చు. దుల్కర్ సల్మాన్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుంది. కమల్ హాసన్ గారి అసలు రూపం పార్ట్ 2 లో చూస్తారు. ఇంకా చాలా మంది కొత్త యాక్టర్స్ పార్ట్ 2లో కనిపిస్తారు. ఇప్పటివరకు పార్ట్ 2 కేవలం 30 రోజులు షూట్ మాత్రమే పూర్తయింది. పార్ట్ 2కి ఇంకా చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాలి. కల్కి పార్ట్ 2 లో మూడు ప్రపంచాలు కాకుండా ఇంకో ప్రపంచం కూడా ఉంటుంది. పార్ట్ 2లో కూడా కృష్ణుడు ఉంటాడు. కానీ ఫేస్ రివీల్ చేయకుండా పార్ట్ 1లో ఉన్నట్టే ఉంటుంది. ఈ సినిమాలో మరియం, కైరా, సుప్రీమ్ యాస్కిన్.. ఇలా అనేక పాత్రలపై సపరేట్ సినిమాలు కూడా చేసే ఛాన్స్ ఉంది కానీ చేయకపోవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…