Pushpa Allu Arjun Walking Style : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ అస‌లు ఎలా వచ్చిందో తెలుసా..? దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే..?

Pushpa Allu Arjun Walking Style : ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బ‌న్నీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో పాటలు డైలాగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట…విదేశాల్లో కూడా వినిపించింది. ఈ పాటలో అల్లు అర్జున్ ఐకానిక్ వాకింగ్ స్టైల్ అందర్నీ కట్టి పడేసింది. అయితే శ్రీవల్లి పాటలో ఎందుకు అసలు అలా నడిచాడో అన్న విషయం ఆ మ‌ధ్య ఓ సంద‌ర్భంలో బయటపెట్టాడు బ‌న్నీ. ‘‘ఆ సిగ్నేచర్‌ వాక్‌ వెనుక క్రెడిట్‌ మొత్తం దర్శకుడు సుకుమార్‌దే.

సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేముందు ఒక రోజు సుకుమార్‌ వచ్చి, ‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ సినిమాలో నీ వాకింగ్‌ స్టైల్‌ ట్రెండ్‌ అయిపోవాలి’’అన్నారట. దీంతో భుజం పైకి ఎత్తి నడిచే స్టైల్‌ చూపించడంతో సుకుమార్ ఫుల్ ఫిదా అయ్యాడ‌ట‌. దాంతో సేమ్ టూ సేమ్ సినిమాలో అలానే పెట్టేశాడు సుక్కూ. అయితే సాంగ్‌లో చెప్పు జారిపోవ‌డం అనేది కావాల‌ని చేసింది కాదు, బై మిస్టేక్ జారిపోగా, అది కూడా న‌చ్చి సినిమాలో ఉంచేశాడు సుక్కూ. అయితే అలా నడిచినప్పుడు యువతలో ఇంత ట్రెండ్‌ అవుతుందనుకోలేదు అని అన్నాడు అల్లు అర్జున్‌. సినిమా బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు బాగా నచ్చితే, అందరికీ చేరిపోతుందని నమ్ముతాను నేను. ‘పుష్ప’ విషయంలో అదే జరిగింది అని అన్నాడు.

Pushpa Allu Arjun Walking Style know how it is created
Pushpa Allu Arjun Walking Style

పుష్ప 1’లో తగ్గేదేలే అంటూ చెప్పిన బన్నీ.. రెండో పార్ట్‌లో కుమ్మేస్తా అనే పదాన్ని వాడనున్నట్లు సమాచారం. అది కూడా డిఫరెంట్‌ మాడ్యులేషన్‌లో ఉంటుందట. అలాగే వాకింగ్‌ అలానే ఉన్నా.. అందులో కొత్తదనం చూపించేలా చూస్తారట. తొలి సినిమాలో కేవలం పుష్పరాజ్‌ రైజ్‌ మాత్రమే చూపించారు. ఇప్పుడు రూల్‌ చూపించాలి కాబట్టి ఆ స్థాయికి తగ్గ మేనరిజమ్స్ కోసం బాగానే ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago