Pushpa Allu Arjun Walking Style : ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బన్నీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో పాటలు డైలాగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట…విదేశాల్లో కూడా వినిపించింది. ఈ పాటలో అల్లు అర్జున్ ఐకానిక్ వాకింగ్ స్టైల్ అందర్నీ కట్టి పడేసింది. అయితే శ్రీవల్లి పాటలో ఎందుకు అసలు అలా నడిచాడో అన్న విషయం ఆ మధ్య ఓ సందర్భంలో బయటపెట్టాడు బన్నీ. ‘‘ఆ సిగ్నేచర్ వాక్ వెనుక క్రెడిట్ మొత్తం దర్శకుడు సుకుమార్‌దే.
సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేముందు ఒక రోజు సుకుమార్ వచ్చి, ‘నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ సినిమాలో నీ వాకింగ్ స్టైల్ ట్రెండ్ అయిపోవాలి’’అన్నారట. దీంతో భుజం పైకి ఎత్తి నడిచే స్టైల్ చూపించడంతో సుకుమార్ ఫుల్ ఫిదా అయ్యాడట. దాంతో సేమ్ టూ సేమ్ సినిమాలో అలానే పెట్టేశాడు సుక్కూ. అయితే సాంగ్‌లో చెప్పు జారిపోవడం అనేది కావాలని చేసింది కాదు, బై మిస్టేక్ జారిపోగా, అది కూడా నచ్చి సినిమాలో ఉంచేశాడు సుక్కూ. అయితే అలా నడిచినప్పుడు యువతలో ఇంత ట్రెండ్ అవుతుందనుకోలేదు అని అన్నాడు అల్లు అర్జున్. సినిమా బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు బాగా నచ్చితే, అందరికీ చేరిపోతుందని నమ్ముతాను నేను. ‘పుష్ప’ విషయంలో అదే జరిగింది అని అన్నాడు.
పుష్ప 1’లో తగ్గేదేలే అంటూ చెప్పిన బన్నీ.. రెండో పార్ట్‌లో కుమ్మేస్తా అనే పదాన్ని వాడనున్నట్లు సమాచారం. అది కూడా డిఫరెంట్ మాడ్యులేషన్‌లో ఉంటుందట. అలాగే వాకింగ్ అలానే ఉన్నా.. అందులో కొత్తదనం చూపించేలా చూస్తారట. తొలి సినిమాలో కేవలం పుష్పరాజ్ రైజ్ మాత్రమే చూపించారు. ఇప్పుడు రూల్ చూపించాలి కాబట్టి ఆ స్థాయికి తగ్గ మేనరిజమ్స్ కోసం బాగానే ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.