Viral Photo : హీరోయిన్స్ తమ అందచందాలతో అభిమానులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యూట్ క్యూట్ అందాలతో కేక పెట్టించే ముద్దుగుమ్మలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఆ రోజుల్లో వీరి లుక్స్ ఎలా ఉండాయి అని తెలుసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి కొందరు ప్రముఖుల చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అలా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా. ఢిల్లీ భామ రాశీ ఖన్నా.
మద్రాస్ కేఫే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన రాశీ.. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఇటీవల పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత థాంక్యూలో నటించింది. అది కూడా ఫ్లాప్ కావడంతో ఈ భామకి ప్రస్తుతం తెలుగులోపెద్దగా ఆఫర్స్ లేవు. ఇటీవల రాశీ ఖన్నా కూడా సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.
ఇక ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భామ ఇటీవల రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశారట. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఆమె భయపడ్డారట. . యాక్టర్‌కు ఎంకరేజ్‌మెంట్ ఉంటే వీలున్నప్పుడల్లా ఇలాంటీ కొత్త పాత్రల్లో నటించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రానున్న రోజులలో రాశీ ఖన్నా మరిన్ని మంచి పాత్రలతో అలరించే ప్రయత్నం చేయనుందని చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…