Hit 2 Movie : ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన అడివి శేష్.. ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తుండడంతో కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. కేవలం 3 రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించిందంటే.. ఈ మూవీని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ మొదటి మూవీ హిట్ కావడంతో ఇప్పుడు రెండో పార్ట్‌ను ఇంకో స్టోరీతో, వేరే నటీనటులతో నిర్మించారు. దీంతో సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులకు నచ్చేసింది.
హిట్ 1, 2 మూవీలను నటుడు నాని నిర్మించారు. ఈ మూవీకి సుమారుగా రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో తక్కువ బడ్జెట్‌లోనే నాని జాక్ పాట్ కొట్టేశాడని అంటున్నారు. ఈ సినిమాకి నాని నిర్మాతగా వ్యవహరించగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. అడివి శేష్, మీనాక్షి చౌదరిలు కీలకపాత్రల్లో నటించారు. అయితే హిట్ 3 మూవీని కూడా నిర్మించనున్నట్లు హిట్ 2 చివర్లో చూపించారు. హిట్ 3 లో నాని స్వయంగా నటించనున్నట్లు తెలిపారు. దీంతో ఆ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది హిట్ 3 రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. ఇక నాని దసరా అనే మరో మూవీతోనూ వచ్చే ఏడాది పలకరించనున్నాడు.
కాగా హిట్ 2 మూవీ సక్సెస్ కావడంతో దీన్ని 2 నెలల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ 2 ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక కథ విషయానికి వస్తే.. వైజాగ్‌లో అమ్మాయిలను దారుణంగా హత్య చేసే సీరియల్ కిల్లర్‌ను పోలీస్ ఆఫీసర్ అయిన అడివి శేష్ ఎలా పట్టుకున్నాడు.. అనేది ఇతి వృత్తంగా ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ టాక్ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ దిశగా దూసుకుపోతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…