Prudhvi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన బ్రో చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. అయితే సినిమా సక్సెస్ టాక్ అందుకున్నా ఓ విషయంలో మాత్రం వివాదం నడుస్తుంది. శ్యాంబాబు పేరుతో అంబటి రాంబాబుని ట్రోల్ చేశారని కొందరు కామెంట్స్ చేస్తుండగా, అంబటి కూడా దీనిపై స్పందించడం విశేషం. రాజకీయాలలో పోటీ పడలేక తాను ఇలా చేశాడని పవన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే తన పాత్ర గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడిన పృథ్వీ.. శ్యాంబాబు పాత్రకు ఈ స్థాయిలో గుర్తింపు వస్తుందని తాను అనుకోలేదని కమెడియన్ పృథ్వీ అన్నారు.
ఈ సినిమా తరవాత తాను సుమారు 20 ఇంటర్వ్యూల్లో పాల్గొన్నానని.. ఏదైనా ఒక సినిమాకు సంబంధించి కానీ, పొలిటికల్‌గా కానీ ఇన్ని ఇంటర్వ్యూలు ఎప్పుడూ చేయలేదని ఆయన వెల్లడించారు. రోరింగ్ లయన్ పక్కన ఫొటో దిగడం ఒక అదృష్టం. అలాంటిది ఆయనతో ఇదివరకు మూడు సినిమాలు చేశాను. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు చేశాను. ఇది నాలుగోది. ఈ సినిమా విడుదలకాగానే నా పాత్ర పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ అయిపోయింది. సినిమాలో మంచి ఉందిరా నాయన.. టైమ్ వాల్యూ తెలుసుకోండిరా.. మీరు ఎంత సంపాదించినా రేపు పొద్దున్న వెళ్లిపోవాల్సింది మట్టిలోకేరా.. మానవ సంబంధాలు తెలుసుకోండి.. టైమ్ లేదని చెప్పకండి అన్నారు.
టీవీల్లో నంబర్ ఆఫ్ షాట్స్.. ఎక్కడ చూసినా శ్యాంబాబు, రాంబాబు. మంత్రి గారిని ఈ విధంగా డీగ్రేడ్ చేయడమేంటని నన్ను చాలా మంది అడిగారు. ఎవరండి మంత్రి అంటే.. అంబటి రాంబాబు అన్నారు. ఆయనెవరో నాకు తెలీదు అన్నాను. నాకు తెలీదండి.. తెలియనోడి గురించి నేనెందుకు చేస్తాను అన్నాను. అయినా ఆస్కార్ లెవల్లో నటుడేం కాదు అతను.. ఆయన్ని నేనెందుకు ఇమిటేట్ చేస్తాను అన్నాను. నాకు సముద్రఖని ఏం చెప్పారంటే.. ఒక పనికిమాలిన వెధవ, బాధ్యతలేని వెధవ, బారుల్లో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డాన్స్ చేస్తాడు, ఇదీ మీ క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన చెప్పింది నేను చేయాలి. నేను బయటికి వెళ్లి వచ్చినా సినిమా రంగం నన్ను అక్కున చేర్చుకుంది అని చెప్పుకొచ్చారు. పృథ్వీ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…