Chiranjeevi : హృదయ కాలేయం వంటి సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి బేబి సినిమాతో మంచి డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు సాయి రాజేష్. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. మూవీ ఇంత పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో చిరంజీవి సమక్షంలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. మెగా కల్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేష్ మెగాస్టార్ అంటే తనకు ఎంత ఇష్టమో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒక చిరంజీవి ఫ్యాన్‌కి ఉండే అదృష్టాలు మీకు ఉండవు అన్నయ్య. మేము ఎలా ఉంటాం.. ఏం చేస్తాం.. అనేది మీరు చూడలేరు. మేము ఏదైనా డిప్రెషన్ లో ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ లో ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట.. మీరే మా పారాసెటమల్, మీరే మా మ్యాన్షన్ హౌజ్, మీరే మా సింగిల్ మార్ట్.. అన్ని మీరే అని అన్నాడు.
నేను దర్శకుడిని అయితే నా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పడగానే చిరంజీవి ఫోటో ఉండాలని అనుకున్నాను. అలా నేను చేసిన నాలుగు సినిమాల్లో మీ ఫోటో ఉంటుంది. నేను నాస్తికుడిని అన్నయ్య. మీ ఫోటో పడిన తర్వాతే నా సినిమా స్టార్ట్ అవుతుంది. మా జీవితాల్లో ఉన్నందుకు మీకు చాలా థాంక్స్. సాయి రాజేష్ అంటే చిరంజీవి అభిమానుల్లో చిరంజీవి లాంటోడు. నేను అలాగే ఫీల్ అవుతా. ప్రతి ఫ్యాన్ ఇలానే ఫీల్ అవుతాడు” అని సాయి రాజేష్ చెప్పారు. “మీ ఎదురుగా కూర్చుని ఆరోజు మాట్లాడినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడు అసలు మీరు ఏం మాట్లాడారో సగం వినను కూడా వినలేదు. ఎందుకంటే అప్పుడు నా జీవితం మొత్తం కనిపించింది. సినిమా డైలాగ్ అనుకుంటారేమో కానీ.. మీరు అడగండి అన్నయ్య.. ప్రాణం ఇచ్చేస్తామ్” అంటూ ఎమోషనల్ అయ్యారు దర్శకుడు సాయి రాజేష్.
అన్నయ్య.. ఈ రోజు మీ స్పీచుకు ఎంత డిమాండ్ ఉందో..ఎస్ కే ఎన్, నేను ఈ రోజు ఏం మాట్లాడతామా? అని సోషల్ మీడియాలో అంతే డిమాండ్ ఉంది.. జై చిరంజీవి ఆడియో ఫంక్షన్‌కు శిల్పా కళా వేదిక బయట పోలీసులతో దెబ్బలు తిన్నా, స్టాలిన్ టైంలో లోపలి వరకు వచ్చా.. మా అవార్డ్స్ టైంలో ఒకే వరుసలో కూర్చున్నా.. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న అన్నా.. ఒక ఫ్యాన్‌కే తెలుస్తది ఈ మూమెంట్ అంటూ మెగాస్టార్ పై సాయి రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…