Extra Jabardasth : బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచే కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ఈ వారం ఎపిసోడ్ మరింత స్పెషల్‌గా అలరించనుంది. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అర్జున్ రెడ్డి స్పూఫ్, విక్రమార్కుడు స్పూఫ్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలానే వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య వచ్చిన కొన్ని సీన్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి. కాలేజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా, ఇది విడదీసింది. అందుకే బాధగా బ్రతికేస్తున్నాఅంటాడు ఇమ్మూ. ఇక అప్పుడే వర్షని చూసి నువ్వు ఏ మారలేదని అంటాడు.
అప్పుడు నేను గుర్తున్నానా, నేను చేసినవన్నీ గుర్తున్నాయా అని వర్ష అంటే.. అప్పుడు ఇమ్మాన్యుయేల్ నాతో చేసినవి గుర్తున్నాయి, వేరే వాళ్లతో చేసినవి కూడా గుర్తున్నాయి అని అంటాడు. ఇది చాలా సెటైరికల్గా అందరికి అనిపించింది. బుల్లితెరపై సూపర్ పాపులర్ అయన జంటల్లో ముందుగా చెప్పుకునేది సుడిగాలి సుధీర్ అండ్ రష్మి గౌతమ్ జంట. వీరి తర్వాత అంతా ఫేమస్ అయింది మాత్రం జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష. వీళ్లద్దరు ప్రేమలో ఉన్నట్లు ఇప్పటివరకు అనేక షోలలో బాహటంగానే చెప్పుకున్నారు.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చాలా స్కిట్స్ లలో తమ మధ్య ప్రేమ ఉన్నట్లు నటించారు. అలాగే స్కిట్ అయిపోయాక ఇమ్మాన్యుయేల్ పై వర్షకు ఎంతో ప్రేమ ఉన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పింది. ఒక స్కిట్ లో వాళ్లిద్దరకి పెళ్లి కూడా చేసి చూపించారు. తాజాగా స్కిట్‌లో వీరిద్దరి మధ్య పవర్ ఫుల్ పంచ్‌లు పేలనున్నట్టు తెలుస్తుంది. ఇక మిగతా టీమ్ లీడర్స్ కూడా వైవిధ్యమైన స్కిట్‌లతో అలరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి పంచ్‌లు బాగా పేలనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆగస్ట్ 4న ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుండగా, దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…