Pragathi : టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలతో బాగా ఫేమస్ అయిన ఈవిడ లాక్ డౌన్ టైంలో హీరోయిన్స్ మాదిరి జిమ్లో వర్కౌట్లు చేయడం, మాస్ పాటలకు డాన్స్ వీడియోలు చేయడం, అందాలు కనిపించేలా ట్రెండీ దుస్తుల్లో కనిపించడం ఒక్కటేమిటి… ఇలా ఈమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.దాంతో ప్రగతి పేరు సోషల్ మీడియాలో తెగ మారు మ్రోగింది. లాక్ డౌన్ టైంలో ఈమె సోషల్ మీడియా ఖాతాలకు కూడా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనని ఆంటీ అంటే కోపం వస్తుంది అని కూడా తెలిపింది. అలాగే తన విడాకులకు కారణాలు కూడా చెప్పుకొచ్చింది ఈ సీనియర్ బ్యూటీ. నాకు నా పిల్లలే ప్రపంచం. మగాడి అండ లేకుండా నేనే ఒంటరిగా పోరాటం చేసి నా పిల్లల్ని చదివించుకున్నాను. ఈరోజు వాళ్ళ కెరీర్ కోసం సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారు.అదే నా సక్సెస్ గా భావిస్తాను. అయితే మా అమ్మ గారు సింగిల్ గా జీవించారు కదా.. అని నేను సింగిల్ గా ఉండకూడదు అని నా భర్తతో నేను కలిసి ఉండడానికి చాలా కష్టపడ్డాడు. కానీ నా కష్టం ఫలించలేదు. అందుకే విడాకులు తీసుకున్నాను అని ప్రగతి చెప్పుకొచ్చింది.
కొద్ది రోజులుగా ప్రగతి రెండో పెళ్లికి సంబంధించి వార్తలు వస్తుండగా, స్పందించింది. రెండో పెళ్లిపై ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా చేసుకోవాలని అనిపించిందా? అని యాంకర్ అడగగా దానికి స్పందించిన ప్రగతి… “పెళ్లి అనేది అవసరం. కానీ ఆ పదం కన్నా కంపానియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చాలాసార్లు నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపించింది.. కానీ మళ్లీ నా మెచ్యూరిటీ లెవెల్‌కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.. అదీగాక సింగిల్ పర్సన్ దొరకడం కష్టం. కానీ.. రావాలని ఉంటే అది జరుగుతుంది. అయినా నాతో కొంచెం కష్టం. ఎందుకంటే.. కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్‌గా ఉంటాను. ఇలాగే కావాలి, అలాగే ఉండాలి అని అనుకుంటాను. 20 వయస్సులో ఉంటే అడ్జెస్ట్ అయ్యేదాన్ని కాని, ఇప్పుడు కాస్త కష్టం అని చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…