Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసి వరుస సినిమాలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన ప్రభాస్..త్వరలో సలార్ చిత్రంతో అలరించబోతున్నాడు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ కే కూడా చేస్తుండగా,ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో స్పిరిట్, మారుతి సినిమా రాజా డీలక్స్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో సినిమా, ఆ తర్వాత రాజమౌళితో మరో సినిమా చేయబోతున్నాడట ప్రభాస్. ఓ హాలీవుడ్ మూవీలోను ప్రభాస్ నటించే అవకాశం ఉంది.
అయితే సినిమాల పరంగా మంచి స్పీడ్‌లో ప్రభాస్ గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేక విదేశాలు తిరుగుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రభాస్ చేస్తున్నవన్నీ కూడా కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే ఉండటంతో ఆయన కాళ్ళకి సర్జరీ చేయాల్సి వచ్చింది. అమెరికాకు వెళ్లి మరి అక్కడ కాలికి సర్జరీ చేయించుకొని ఇండియాకు తిరిగి వచ్చి, ఇక్కడ ఫిజియోథెరపీ సెషన్ లో కూడా చేయించుకున్నారు ప్రభాస్. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్టేజి మీదకి మెట్లు ఎక్కలేకపోవడంతో, ఒక సపరేట్ ఎక్విప్మెంట్ తెప్పించి స్టేజ్ ఎక్కడానికి ఆయనకు సహాయపడ్డారు.
అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ కు వచ్చిన సమయంలో ప్రభాస్ ఒక్కడే నడవలేకపోయాడు. మెట్లు కూడా ఎక్కలేక ఇబ్బంది పడ్డాడు. నడుస్తున్నప్పుడు చాలా అన్ ఈజీగా కనిపించాడు ప్రభాస్. పక్కనే దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ సాయం తీసుకుని నడిచాడు. అలా రెండు మూడు సార్లకు పైగా ప్రభాస్ స్టేజ్ పైకి ఎక్కడంలో ఇబ్బండి పడ్డాడు. అయితే ఇంత కాలు నొప్పి పెట్టుకొని కూడా ప్రభాస్ ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడని ప్రతి ఒక్కరు ముచ్చటించుకుంటున్నారు. అతని డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం సినిమా షూటింగ్‌లో గాయపడటంతో అతడు చికిత్స నిమిత్తం స్పెయిన్‌కు వెళ్లాడు. అక్కడ చికిత్స చేసుకొని కొన్నిరోజుల పాటు రెస్ట్ తీసుకోని ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…