Pawan Kalyan : నన్ను ఓడించ‌డానికి కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు.. మీరే కాపాడాలి అంటూ ప‌వ‌న్ విన్న‌పం..

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి విజ‌య యాత్ర‌తో దూసుకుపోతున్నారు. వైసీపీపై దారుణ‌మైన పంచ్‌లు విసురుతూ త‌న యాత్ర కొన‌సాగిస్తున్నారు. ‘వారాహి విజయయాత్ర’లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్ మాట్లాడారు. బాధిత రైతుల వద్దకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన నాయకులు వస్తున్నారంటే వారి ఖాతాల్లో డబ్బులు ఎలా పడుతున్నాయని ప్రశ్నించారు. జనసేన పార్టీ గొంతెత్తితే రోడ్లు ఎలా పూడుస్తున్నారని నిలదీశారు. పోరాటం చేసే వాడు.. బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి అడ్డూ అదుపు ఉండదన్నారు.

ఫ్యాక్ట‌రీల‌కేమో భారీ డ‌బ్బుతో వంతెనలు నిర్మించుకుంటున్నారు. గిరిజ‌నుల బాగోగుల కోసం మాత్రం డబ్బులు లేవ‌ని అంటున్నారు. డ్ర‌గ్స్ విక్ర‌యాలు భారీగా జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతుంటే డీజీపీ గారు అవేమి లేవని అంటున్నారు. కాకినాడ ఎమ్మెల్యే తెలంగాణ నుండి భారీగా మ‌ద్యం త‌ర‌లిస్తున్నారు. వైసీపీ గుండాలు విశాఖ డైరీని కూడా లాగేసుకునే ప‌రిస్థితి ఉంది. భీమ‌వ‌రంలో నేను పోటీ చేస్తే న‌న్ను ఓడించ‌డానికి వీరు కొన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారు. 75వేల ఓట్లు మాత్ర‌మే అక్క‌డ ఉండ‌గా, అక్క‌డ అద‌నంగా ప‌దిహేను వేల‌కి పైగా అద‌నంగా ఓట్లు పోల‌య్యాయి. వీళ్లు న‌న్ను ఓడించడం కోసం ఎంత‌కైన తెగిస్తున్నారు. కొన్ని కోట్లు ఖ‌ర్చ చేస్తున్నారు. మీరే ఈ సారి న‌న్ను కాపాడాలి అంటూ ప‌న‌వ్ ఓట‌ర్స్ ని కోరారు.

Pawan Kalyan requests people to win him
Pawan Kalyan

గాజువాకలో మొన్న ఎలక్షన్లకు ఉన్న ఓట్లు 3,10,011 అయితే పోలైన ఓట్లు చూస్తే 1,99,284 ఉన్నాయట. పోలింగ్ శాతం 64.28 అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఉన్న ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు పడడం ఎలా సాధ్యం‌ అని కొంద‌రు అడుగుతున్నారు . అలాగే భీమవరంలో ఉన్న ఓట్లు 2,46,624. పోలింగ్ శాతం 77.94 అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.. అస‌లు ఇవి ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. 2019లో ఆలోచించి ఓటు వేసి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలైనా భర్తీ చేసే వాళ్లమని చెప్పారు. ప్రజల తరఫున పోరాటం చేసే వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పక్షాన ప్రజలు నిలబడాలని పవన్‌ కళ్యాణ్ కోరారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago