Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రతో దూసుకుపోతున్నారు. వైసీపీపై దారుణమైన పంచ్‌లు విసురుతూ తన యాత్ర కొనసాగిస్తున్నారు. ‘వారాహి విజయయాత్ర’లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. బాధిత రైతుల వద్దకు పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు వస్తున్నారంటే వారి ఖాతాల్లో డబ్బులు ఎలా పడుతున్నాయని ప్రశ్నించారు. జనసేన పార్టీ గొంతెత్తితే రోడ్లు ఎలా పూడుస్తున్నారని నిలదీశారు. పోరాటం చేసే వాడు.. బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి అడ్డూ అదుపు ఉండదన్నారు.
ఫ్యాక్టరీలకేమో భారీ డబ్బుతో వంతెనలు నిర్మించుకుంటున్నారు. గిరిజనుల బాగోగుల కోసం మాత్రం డబ్బులు లేవని అంటున్నారు. డ్రగ్స్ విక్రయాలు భారీగా జరుగుతున్నాయని ప్రజలు చెబుతుంటే డీజీపీ గారు అవేమి లేవని అంటున్నారు. కాకినాడ ఎమ్మెల్యే తెలంగాణ నుండి భారీగా మద్యం తరలిస్తున్నారు. వైసీపీ గుండాలు విశాఖ డైరీని కూడా లాగేసుకునే పరిస్థితి ఉంది. భీమవరంలో నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి వీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. 75వేల ఓట్లు మాత్రమే అక్కడ ఉండగా, అక్కడ అదనంగా పదిహేను వేలకి పైగా అదనంగా ఓట్లు పోలయ్యాయి. వీళ్లు నన్ను ఓడించడం కోసం ఎంతకైన తెగిస్తున్నారు. కొన్ని కోట్లు ఖర్చ చేస్తున్నారు. మీరే ఈ సారి నన్ను కాపాడాలి అంటూ పనవ్ ఓటర్స్ ని కోరారు.
గాజువాకలో మొన్న ఎలక్షన్లకు ఉన్న ఓట్లు 3,10,011 అయితే పోలైన ఓట్లు చూస్తే 1,99,284 ఉన్నాయట. పోలింగ్ శాతం 64.28 అని తెలుస్తుంది. అలాంటప్పుడు ఉన్న ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు పడడం ఎలా సాధ్యం అని కొందరు అడుగుతున్నారు . అలాగే భీమవరంలో ఉన్న ఓట్లు 2,46,624. పోలింగ్ శాతం 77.94 అని కొందరు చెప్పుకొస్తున్నారు.. అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. 2019లో ఆలోచించి ఓటు వేసి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలైనా భర్తీ చేసే వాళ్లమని చెప్పారు. ప్రజల తరఫున పోరాటం చేసే వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పక్షాన ప్రజలు నిలబడాలని పవన్ కళ్యాణ్ కోరారు.