Ram Charan And Upasana : బిడ్డ‌కు మేం పెట్ట‌బోతున్న పేరు అదే.. మీడియా ముందుకు చ‌ర‌ణ్ దంప‌తులు..

Ram Charan And Upasana : జూన్ 20 ఉద‌యం 1.49ని.ల‌కు ఉపాస‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల‌ని, రామ్ చ‌ర‌ణ్ స‌న్నిహితుల‌ని కూడా ఎంతో ఆనందింప‌జేసింది. బిడ్డ పుట్టిన‌ప్ప‌టి నుండి ఆ చిన్నారికి సంబంధించిన విష‌యాలు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రసవం తర్వాత ఉపాసన ఈరోజు హస్పిటల్ నుంచి డిచార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్ చరణ్ మాట్లాడారు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడిన రామ్ చరణ్ చాలా సంతోషంగా ఉంది అన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, మెగా ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్ మా పాపకు అందాయి. ఇందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా తమ పాప పట్ల ఆనందం వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది.

మా పాపకు ఎప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. పాప పుట్టిన క్షణం నేను మాటల్లో చెప్పలేని ఆనందం. ఇన్నాళ్లు దేవుడు మాకు పండంటి బిడ్డను ప్రసాదించడం ఎంతో ఆనందంగా ఉంది. పాపను అందరూ ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. త్వరలో పాపకు నామకరణం కూడా చేస్తాం. నాకు పెద్దగా సంప్రదాయాలు తెలియవు. 13వ రోజున, లేదంటే 21వ రోజున పాపకు ఏం పేరు పెట్టబోతున్నామనేది స్వయంగా వెల్లడిస్తాం. ఇప్పటికే ఓ పేరు కూడా ఉపాసన నేను ఎంపిక చేశామంటూ చెర్రీ చెప్పుకొచ్చారు. 21వ రోజును స్వ‌యంగా నేను పాప పేరు తెలియ‌జేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

Ram Charan And Upasana came before media after their daughter
Ram Charan And Upasana

ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డ జన్మించిన రోజున మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజు అమ్మాయి పుట్టడంతో మెగాస్టార్ మరింత సంబరపడ్డారు. తన ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ విజయాలు, వరుణ్ తేజ్ నిశ్చితార్థం, మనవరాలు పుట్టడం… తమ ఇంట అన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక రామ్ చ‌ర‌ణ్ విష‌యానికి స‌వ్తే.. ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’తో గత ఏడాది భారీ విజయం అందుకోవడం మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ అందుకున్న రామ్ చరణ్… సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్, అగ్ర నిర్మాత ‘దిల్’ రాజుతో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago