Bye Bye YSRCP : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పూర్తి దృష్టి రాజకీయాలపై పెట్టిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌తో పాటు వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. పదవి ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి సేవ చేయడం లేదని ఆయన మండిపడ్డారు. నిన్న పవన్ .. కోనసీమ జిల్లా వారాహి విజయ యాత్రలో భాగంగా అమలాపురం గడియార స్తంభం కూడలిలో బహిరంస సభ వేదిక నుంచి ప్రజలకు హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదాన్ని వినిపించారు. ఇదే ఎన్నికల నినాదం కావాలని..అరాచక ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి ..అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
“వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేటు పెరిగిపోయిందన్నారు. అక్కను వేధించొద్దు అన్న పాపానికి బాపట్లలో 14 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారని, రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందని, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారన్నారు. పాలించే నాయకులు బాధ్యతగా ప్రవర్తించకపోవడం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందన్నారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆ హత్యను కవర్ చేయడానికి గుండెపోటు నాటకం ఆడారని, తరువాత విషయం బయటకు పొక్కడంతో ఎవరో చంపారని చెప్పారని, నిజం బయటకొస్తుందనే భయంతో ఒక వ్యక్తిని చంపేశారంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందదని చెప్పిన పవన్ కల్యాణ్ ..జగన్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కంటే గొప్పవాడిగా ఫీలవుతున్నారని మండిపడ్డారు. అందుకే విదేశీ విద్యా పథకానికి అంబేడ్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులకు సంబంధించిన 23పథకాలను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. మద్య అమ్మకం పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు విషాన్ని అమ్ముతోందని ఆరోపించారు. అభం, శుభం తెలియని ఆడబిడ్డల తాళి బొట్లు తెగడానికి జగనే కారణమంటూ ఘాటు విమర్శలు చేశారు. మద్యం మాత్రమే కాదని..రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం గంజాయి మత్తులో ముంచిందన్నారు. యువత గంజాయి జోలికి పోకూడదని పవన్ కల్యాణ్ సూచించారు. 2019లో తనకు అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన జగన్ రెడ్డి మాటలను ప్రజలు సంపూర్ణంగా నమ్మారని, ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఎన్నో ఘోరాలు.. ఇంకెన్నో కష్టాలు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొవల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…