Sudhakar : కమెడీయన్ సుధాకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 90ల సమయంలో ఆయన స్టార్ కమెడీయన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అనారోగ్యం వలన సుధాకర్ ఇప్పుడు పెద్దగా లైమ్ లైట్‌లో ఉండడం లేదు. ఇటీవల సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.కాని ఆయనే స్వయంగా ఆ వార్తలని ఖండించారు. ఇక చిరంజీవితో సుధాకర్‌కి గొడవలు వచ్చాయని, వారిద్దరి మధ్య దూరం పెరిగిందని ఇలా ఎన్నో ప్రచారాలు సాగగా వాటన్నింటికి సుధాకర్ క్లారిటీ ఇచ్చారు.
ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో చిరంజీవితో కలిసి ఒకే రూమ్‌లో ఉండేవాడినని సుధాకర్ తెలిపారు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. చిరు ని, పవన్ కల్యాణ్ ని అన్నయ్య అని పిలుస్తానని వెల్లడించారు. తనకు ఏ అవసరం వచ్చినా కూడా చిరునే అడుగుతానని.. ఆయన కాదనకుండా సాయం చేస్తారని తెలిపారు. ఆ కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సుధాకర్ తెలిపారు. ఒకే రూంలో ఉన్నప్పుడు నేను కూర చేస్తే చిరు రైస్ పెట్టే వారని అన్నారు. ఇప్పటివరకు మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు. ఇక చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది చిరంజీవి తర్వాత పవన్ కు నేనే అన్నయ్య.
త్వరలోనే నా కుమారుడు బిన్నీ సినిమాల్లోకి రానున్నాడు. చిరంజీవి దీవెనలు వాడికి ఉన్నాయి. మా అబ్బాయి (బెనెడిక్ మైఖేల్) గురించి ఇప్పుడే నేను మాట్లాడకూడదు. కానీ చిరంజీవి చేతుల మీదుగానే మా వారసుడి తెరంగేట్రం జరుగుతుంది. గతంలో బెన్నీ కాలేజీ సీటు విషయంలో చిరంజీవి చాలా హెల్ప్ చేశారు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు సుధాకర్. ఇక ఇప్పుడు తన సినిమా కెరీర్ విషయంలో కూడా చిరంజీవే చూసుకుంటారు అని చెప్పుకొచ్చారు సుధాకర్. ఈ క్రమంలో సుధాకర్ కుమారుడికి చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…