Pawan Kalyan : ముద్ర‌గ‌డ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ తీవ్ర ఆగ్ర‌హం.. ఇన్నాళ్లూ ఏం చేశార‌ని కామెంట్స్‌..

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌స్తుతం ఏపీలో వారాహి యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వారాహి యాత్ర‌లో భాగంగా త‌న రాజ‌కీయ ప్ర‌ణాళిక గురించి వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై క్లారిటీ ఇస్తూ వ‌స్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ.. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పవన్‌ మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో.. గుండ్లు గీయించారో చెప్పాలని పవన్‌ను ముద్రగడ ప్రశ్నించారు. ఇక. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తోందని మాట్లాడటం తప్పు అని, కాపుల ఉద్యమానికి సహాయం చేసినవారిని విమర్శించడం కరెక్ట్‌ కాదని ఆయ‌న అన్నారు.. కాపు ఉద్యమానికి పవన్‌ ఎందుకు రాలేదని నిలదీశారు.

వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి చిత్తుగా ఓడించండి. సత్తా చూపడానికి ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని, తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి. యువతకు రిజర్వేషన్‌ ఫలాలు పవన్‌ ఎందుకు అందించలేదన్నారు. కాపు ఉద్యమంతో తాను ఓటమికి దగ్గరయ్యానన్నారు ముద్రగడ. అయితే ముద్ర‌గ‌డ లేఖ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిచినట్టు తెలుస్తుంది.అంద‌రు ఆంధ్రులు అనే భావ‌న లేకపోతే బ్ర‌త‌క‌డం కూడా వేస్ట్ అని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఏ హీరో అభిమాని అయిన రైతుల‌కి సాయ‌ప‌డాలంటూ ఆయ‌న సూచించారు.

Pawan Kalyan counters to mudragada for his comments
Pawan Kalyan

మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ అందరి హీరోల అభిమానులకు విజ్ఞప్తి. నాకు వారందరూ ఇష్టమే.. నేను వారి సినిమాలు చూస్తాను.. మీరు వారిని అభిమానించండి. రైతులకు, ప్రజా సమస్యలకు కులం లేదు. వారికి అండగా నిలబడాలి అంటూ కోరారు. మ‌హేష్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో.. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని అన్నారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారని.. ఇది చెప్పడంలో నాకు ఎలాంటి ఈగో లేదు. ప్రజల కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడాలంటూ కోరారు. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago