Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన వారాహి యాత్రలో భాగంగా తన రాజకీయ ప్రణాళిక గురించి వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ.. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పవన్ మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో.. గుండ్లు గీయించారో చెప్పాలని పవన్‌ను ముద్రగడ ప్రశ్నించారు. ఇక. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తోందని మాట్లాడటం తప్పు అని, కాపుల ఉద్యమానికి సహాయం చేసినవారిని విమర్శించడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.. కాపు ఉద్యమానికి పవన్ ఎందుకు రాలేదని నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి చిత్తుగా ఓడించండి. సత్తా చూపడానికి ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని, తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి. యువతకు రిజర్వేషన్ ఫలాలు పవన్ ఎందుకు అందించలేదన్నారు. కాపు ఉద్యమంతో తాను ఓటమికి దగ్గరయ్యానన్నారు ముద్రగడ. అయితే ముద్రగడ లేఖపై పవన్ కళ్యాణ్ స్పందిచినట్టు తెలుస్తుంది.అందరు ఆంధ్రులు అనే భావన లేకపోతే బ్రతకడం కూడా వేస్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ హీరో అభిమాని అయిన రైతులకి సాయపడాలంటూ ఆయన సూచించారు.
మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ అందరి హీరోల అభిమానులకు విజ్ఞప్తి. నాకు వారందరూ ఇష్టమే.. నేను వారి సినిమాలు చూస్తాను.. మీరు వారిని అభిమానించండి. రైతులకు, ప్రజా సమస్యలకు కులం లేదు. వారికి అండగా నిలబడాలి అంటూ కోరారు. మహేష్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో.. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని అన్నారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారని.. ఇది చెప్పడంలో నాకు ఎలాంటి ఈగో లేదు. ప్రజల కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడాలంటూ కోరారు. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.