Prabhas Brother Prabodh : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆయన బాహుబలి సినిమాతో విపరీతమైన స్టార్ డం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే కృష్ణం రాజు నట వారసుడిగా ఎదిగిన ప్రభాస్ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. తన పెద్దనాన్న అడుగుజాడలలో నడుస్తూ తన కుటుంబానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. అయితే ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ఇటీవల అనారోగ్య సమస్యలతో కన్నుమూసారు. ప్రభాస్ చేతుల మీదుగా అతని పెదనాన్న కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని అందరూ భావించారు. అయితే కృష్ణంరాజుకి ఉప్పలపాటి ప్రభోద్ తలకొరివి పెట్టారు.
ప్రబోధ్ కూడా కృష్ణం రాజుకి కొడుకు వరస అవుతాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఈ అంత్యక్రియలు చేయించారని అందరూ అనుకున్నారు. అయితే ప్రభోద్ ఎవరో కాదు.. స్వయానా ప్రభాస్ అన్న అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.. కృష్ణంరాజు తమ్ముడు నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణకు మొత్తం ముగ్గురు పిల్లలు. వారిలో ఒకరు కుమార్తె, ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ప్రబోధ్, రెండవ కుమారుడు ప్రభాస్ సినిమాల పైన ఉన్న ఇంట్రెస్ట్ తో పెదనాన్న నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. కానీ ప్రబోధ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తనకు బిజినెస్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో భీమవరం, మొగల్తూరులో ఉండే వాళ్ళ కొబ్బరి తోటలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులను చూసుకుంటూనే మరోవైపు చాలా బిజినెస్ చేస్తున్నాడు.
ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ మొదలు పెట్టిన సమయంలో ప్రబోధ్ ని కూడా భాగస్వామిగా తీసుకోవాలని అనుకున్నారట. కాని ఏమైందో ఏమో కాని ఆయన ఇందులో భాగస్వామిగా లేదుడ. ఇక ఆ మధ్య చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కుని ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించినట్టుగా తెలుస్తుంది. ప్రభోద్ జైల్లో ఉన్న టైంలో ఆయన వ్యాపారాలకు చాలా బాగా నష్టం కలిగింది. కానీ ఆయన జైలు నుంచి రిలీజ్ అయి వచ్చిన తర్వాత అంతే వేగంగా బిజినెస్‌లో పుంజుకుని.. ప్రస్తుతం తనే ఎంచుకున్న వ్యాపారంగంలో లాభాలతో రాణిస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…