Virupaksha Movie : మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది.. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ మిస్టికల్ థ్రిల్లర్ సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అయితే మూవీ రిలీజ్ తర్వాత ఎవరూ ఊహించని స్థాయిలో రికార్డ్ విజయాన్ని దక్కించుకుంది. థియేట్రికల్‌గా ఇప్పటి వరకు ‘విరూపాక్ష’ చిత్రం రూ. 87 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక షేర్ కలెక్షన్స్ పరంగా చూస్తే దాదాపు రూ.47 కోట్లను క్రాస్ చేసింది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
రుద్రవనం అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా చిత్రం రూపొందింది. ఓ జంట శాపం కారణంగా ఆ ఊరిలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. ఆ మరణాల మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా విరూపాక్ష కథ. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని మెప్పించాయి. విరూపాక్షకు సీక్వెల్ చేయబోతున్నట్లు దర్శకుడితో పాటు సాయిధరమ్‌తేజ్ ప్రకటించారు. ఈ సీక్వెల్ దీనిని మించి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు అగ్ర దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందించారు. అంతే కాకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల కీలక పాత్రలను పోషించారు.
విరూపాక్ష’ని థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులకు మేకర్స్ మరో గుడ్ న్యూస్‌ను చెప్పేశారు. అదేంటంటే ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో మే 21 నుంచి చూడొచ్చు. థియేటర్స్‌కు రాలేకపోయినవారు ఈ సినిమాను ఇక ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన కూడా చేసింది. రొటీన్‌కి భిన్నంగా దెయ్యాలు, భూతాలనే హారర్ కాన్సెప్ట్‌తో కాకుండా రుద్రవరం అనే ఊరిపై పగ తీర్చుకోవాలనుకున్న ఇద్దరి వ్యక్తుల కథాంశంతో సినిమా రూపొందగా, ఇది ప్రేక్షకులని తప్పక అలరిస్తుంది. ఇంకెందుకు మరి విరూపాక్ష కోసం మే 21 వరకు వేచి చూడండి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…