Poonam Kaur : ఇటీవల అందాల ముద్దుగుమ్మలు పలు రకాల వ్యాధులతో ఆసుపత్రిలో అడ్మిట్ అవుతుండడం అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది. మొన్నటిని మొన్న సమంత మయోసైటిస్‌తో ఆసుపత్రిలో చేరగా, ఇక ఇటీవల శృతి హాసన్ కూడా తన ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. ఇక తాజాగా పూనమ్ కౌర్ తనకు ఫైబ్రోమయాల్జియా బారిన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. శరీరం అంతటా తీవ్రమైన నొప్పి, అలసట, డిప్రెషన్ ఫైబ్రోమయాల్జియా వ్యాధి లక్షణాలు. దీన్ని చూసిన అభిమానులు జాగ్రత్తలు తీసుకుని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
పూనమ్ కౌర్ నటించిన నాతి చరామి సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఆమె తన పోస్ట్‌లో ‘‘ఎన్నో ప్రణాళికలతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తిని ఫైబ్రోమయాల్జియా, నిదానించి విశ్రాంతి తీసుకునేలా చేసింది’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ లో పేర్కొంది. ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సమయంలో.. పూనమ్ కౌర్ ఆయనతో కలసి కొంత దూరంపాటు పాల్గొనడం చూశాం. సడెన్‌గా తాను ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించడంతో అందరు అవాక్కయ్యారు.
పూనమ్ కౌర్‌కు వచ్చిన ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయట. నిద్రలేమితనం, మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, అలసట, మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం, కండరాల సమస్యలు ఏర్పడటం అనేవి ఈ వ్యాధి లక్షణాలు. అయితే నవంబర్ 10వ తేదీన సూరత్‌లోని గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలనే నిరసన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొందట. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష కూడా చేసిందట. అదే రోజు సాయంత్రం 12వ తేదీన ఢిల్లీలో బ్రహ్మకుమారి కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లిందట. దీంతో అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మయాల్జియా నిర్ధారణ అయ్యిందట. ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్న పూనమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…