Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటన, డ్యాన్స్‌తో దుమ్ము రేపేస్తుంటాడు. ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లింది. ఇక నుండి ఎన్టీఆర్ చేయబోయే చిత్రాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటాయని, ఆ సినిమాలతో ఈ హీరో తన క్రేజ్‌ని మరింత పెంచుకుంటాడని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ పూర్తై ఇప్పటికీ ఏడాది పూర్తైనా మరో ప్రాజెక్ట్ ప్రారంభించలేదు . కొరాటలతో సినిమా ఉంటుందని చెప్పిన ఇది సెట్స్ మీదకు వెళ్లడం అంతకంతకూ ఆలస్యమే అవుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే హీరోలకున్న ఇమేజ్, క్రేజ్, స్టార్‌డమ్‌ను తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు పలు బ్రాండ్ల కంపెనీలు ఉపయోగించుకుంటాయని తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ పలు క్లాథింగ్, మార్కెటింగ్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్లలో నటిస్తున్నారు. ఇటీవల రెండు యాడ్ షూట్లలో జాయిన్ అయినట్టు తెలుతస్తుండగా, వాటికి సంబంధించిన లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన లైషియస్ కోసం ఎన్ టీఆర్ యాడ్ చేయగా, ఇందులో రాహుల్ రామక్రిష్ణ తో జూనియర్ కోర్టు లో చేసిన సీన్ ఆకట్టుకుంటోంది.
స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు మురిసిపోతున్నారు. మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం లీసియస్ ప్రమోషన్స్ లో భాగంగా డిజైన్ చేసిన యాడ్ కోసం కొత్త గెటప్‌లోకి మారాడు తారక్. ఆరు పేజీల డైలాగ్‌ను అర సెకన్‌లో చెప్పేసే మీకు ఇంత చిన్న డైలాగ్‌కు అంత టైం అని రాహుల్ రామకృష్ణ అంటుండగా.. చేప చిన్నదైనా ఎర పెద్దదెయ్యాలి.. అంటూ లీసియస్ గురించి ప్రమోట్ చేస్తున్నాడు తారక్. కోర్టులో ఫన్నీగా సాగే ఈ యాడ్ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.ఈ బ్రాండ్ యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ రూ.3.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…