Trivikram Srinivas : రచయిత నుండి టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన త్రివిక్రమ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తుండగా, ఈ సినిమా అనివార్య కారణాల వలన వాయిదా పడింది. వచ్చే వారం నుండి తిరిగి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లగ్జరీ కారుని కొన్నారు.తన భార్య సౌజన్య కోసం ఈ కారు కొన్నట్టు తెలుస్తుంది. బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ కారుని భార్యకి బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేశారని సమాచారం.. ఈ కారు విలువ దాదాపు 1.4 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.
భార్యకు ప్రేమతో త్రివిక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలంటే ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. కామెడీ,సెంటిమెంట్, రిలేషన్ షిప్ తో కూడిన ఆయన సినిమాల్లో కొత్తదనం ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు డైలాగ్స్ రచయిత గానే కాకుండా.. సక్సెస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. నిర్మాణ సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హారిక బ్యానర్ ను ఆయన వెనక ఉండి నడిపిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అటు సితార బ్యానర్ కూడా త్రివిక్రమ్ అండతోనే సాగుతుందని ప్రచారం అయింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సౌజన్యను త్రివిక్రమ్ 2002లో పెళ్లి చేసుకోగా, వారు అంతకుముందే రవీంద్రభారతిలో సౌజన్య భరతనాట్యం సందర్భంగా కలిశారు. ఆ తరువాత సీతారామశాస్త్రి చొరవతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిన తరువాత ఆయన సతీమణి కూడా ఆయనకు విలువైన సలహాలు ఇస్తుండేదని చెబుతుంటారు. త్రివిక్రమ్, సౌజన్య దంపతులికి ఇద్దరు సంతానం కావడం విశేషం. ఇటీవల సౌజన్య నిర్మాణ సంస్థలో అడుగుపెట్టారు. సితార బ్యానర్ పై ‘బుట్టబొమ్మ’ సినిమా నిర్మాణమవుతోంది. దీనికి నిర్మాతగా సితార నాగవంశీ తో పాటు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య కూడా ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…