Pawan Kalyan : కాపీ కొట్ట‌లేదు, నిజాయితీగా ప‌రీక్ష రాసి ఇంట‌ర్ ఫెయిల‌య్యానంటూ ప‌వ‌న్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరు చెబితే అభిమానులు పూన‌కాలు వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. అత‌నిని న‌టుడిగా క‌న్నా నిజాయితీప‌రుడిగా అభిమానులు ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో యాక్టివ్‌గా ఉంటున్న ప‌వ‌న్ కళ్యాణ్ యువ‌త‌కి మంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు అందిస్తూ వ‌స్తున్నాడు. రీసెంట్‌గా వరంగల్ నిట్ లో జరిగిన స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వరంగల్ లోని జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా స్టేజీపై ప్రసంగిస్తూ తన విద్యాభ్యాసం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తన బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు పంచుకుంటూ తన ఇంటర్మీడియట్ పరీక్షల గురించి కొన్ని ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు పవన్ కళ్యాణ్. తాను ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలో తన తోటి విద్యార్థులు, స్నేహితులు స్లిప్స్ తీసుకెళ్లి పరీక్షలు రాస్తున్నా.. తాను మాత్రం చిటీలు పట్టుకెళ్లలేదని చెప్పుకొచ్చాడు వన్ కళ్యాణ్. పరీక్షల్లో తాను ఫెయిల్ అయినా సరే కానీ కాపీ కొట్టకూడదన్న భావనతో.. నిజాయితీగా పరీక్షలు రాసి ఇంటర్ లో ఫెయిల్ అయినట్లు ఆయ‌న అన్నారు. తాను పరీక్షలలో ఉత్తీర్ణత సాధించకపోయినా నైతికంగా మాత్రం విజయం సాధించినట్లు పేర్కొన్నారు పవన్.

Pawan Kalyan said he honestly wrote exams and failed
Pawan Kalyan

తానెప్పుడూ విద్యా సంస్థల కార్యక్రమాలకు పెద్దగా వెళ్లనని ఆ విషయంలో తనది సక్సెస్ స్టోరీ కాద‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తాను నిత్య విద్యార్థిన చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జీవితం నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని అన్నారు . మాజీ ప్రధాని నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని… వరంగల్ ఎన్ఐటీలో చదువుకుంటున్న వారు.. చదువుకు తగ్గ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు ప‌వర్ స్టార్. జీవితంలో పరాజయాలు ఎదురవుతాయని, కానీ రేపు కచ్చితంగా విజయం అందుకుంటారని సూచించారు. కళ అనేది వివిధ ప్రాంతాల వారిని కూడా కలుపుతుందని, దానికి నాటు నాటు పాట నిదర్శనం అంటూ ప‌వ‌న్ ఆసక్తిక‌రంగా మాట్లాడారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago