Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెబితే అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు. అతనిని నటుడిగా కన్నా నిజాయితీపరుడిగా అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం రాజకీయాలలో యాక్టివ్‌గా ఉంటున్న పవన్ కళ్యాణ్ యువతకి మంచి సలహాలు, సూచనలు అందిస్తూ వస్తున్నాడు. రీసెంట్‌గా వరంగల్ నిట్ లో జరిగిన స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వరంగల్ లోని జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా స్టేజీపై ప్రసంగిస్తూ తన విద్యాభ్యాసం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు పంచుకుంటూ తన ఇంటర్మీడియట్ పరీక్షల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తాను ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలో తన తోటి విద్యార్థులు, స్నేహితులు స్లిప్స్ తీసుకెళ్లి పరీక్షలు రాస్తున్నా.. తాను మాత్రం చిటీలు పట్టుకెళ్లలేదని చెప్పుకొచ్చాడు వన్ కళ్యాణ్. పరీక్షల్లో తాను ఫెయిల్ అయినా సరే కానీ కాపీ కొట్టకూడదన్న భావనతో.. నిజాయితీగా పరీక్షలు రాసి ఇంటర్ లో ఫెయిల్ అయినట్లు ఆయన అన్నారు. తాను పరీక్షలలో ఉత్తీర్ణత సాధించకపోయినా నైతికంగా మాత్రం విజయం సాధించినట్లు పేర్కొన్నారు పవన్.
తానెప్పుడూ విద్యా సంస్థల కార్యక్రమాలకు పెద్దగా వెళ్లనని ఆ విషయంలో తనది సక్సెస్ స్టోరీ కాదని అన్నారు పవన్ కళ్యాణ్. తాను నిత్య విద్యార్థిన చెప్పిన పవన్ కళ్యాణ్.. జీవితం నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని అన్నారు . మాజీ ప్రధాని నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని… వరంగల్ ఎన్ఐటీలో చదువుకుంటున్న వారు.. చదువుకు తగ్గ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు పవర్ స్టార్. జీవితంలో పరాజయాలు ఎదురవుతాయని, కానీ రేపు కచ్చితంగా విజయం అందుకుంటారని సూచించారు. కళ అనేది వివిధ ప్రాంతాల వారిని కూడా కలుపుతుందని, దానికి నాటు నాటు పాట నిదర్శనం అంటూ పవన్ ఆసక్తికరంగా మాట్లాడారు.