టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్స్ తెగ సందడి చేసి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచారు. ఆ కోవలో హీరోయిన్ మాధవి ఒకరు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో మొదలై ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టింది మాధవి. అయితే ఈమె ఓవైపు గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే ‘వేణువై వచ్చాను భువనానికీ’.. అంటూ మాతృదేవోభవలో తన అద్భుతమైన అభినయంతో అందరితో కంటతడి కూడా పెట్టించారు.
ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపొద పాటలో చిరుకు పోటీగా స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ లతోనూ మాధవి సినిమాలు చేసింది. కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టీ లాంటి ఆలిండియా సూపర్ స్టార్స్ అందరి సరసన నటించిన మాధవి… తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన మాధవి అప్పటి స్టార్ హీరోయిన్లు శ్రీదేవి, విజయశాంతిలకు గట్టి పోటీ ఇచ్చారు.
సినిమాల్లో బిజీగా ఉండగానే బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరికి టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లీన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే పిల్లలు పెద్ద వాళ్లు అయ్యాక మాధవి బిజినెస్‌పై ఆసక్తి చూపించింది. తన భర్తకు ఉన్న ఔషధ సంస్థను ప్రస్తుతం మాధవినే నిర్వహిస్తున్నారట. అలాగే ఫుడ్ రెస్టారెంట్స్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారట. ప్రస్తుతం ముగ్గురు పిల్లల తల్లిగా ఉన్న మాధవి అటు బిజినెస్ ని, ఇటు కుటుంబాన్ని చక్కగా సమన్వయపరచుకుంటూ ముందుకు వెళుతుంది.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తూ ఉండే మాధవి ఇటీవల షేర్ చేసిన పిక్స్ లో సరికొత్త లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…