Balagam Movie : ఇటీవలి కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బలగం. జబర్ధస్త్‌తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన వేణు టిల్లు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల జల్లు కురిపించారు. డైరెక్టర్ గా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో వేణు కూడా ఫుల్ ఖుష్‌గా ఉన్నాడు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేసింది. దీంతో ఈ సినిమాకు జనం పట్టం కట్టారు. బాక్సాఫీస్ వద్ద లాభాల పంటను పండించిన బలగం, ప్రస్తుతం ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంకా రివీల్ చేస్తూ, జనంలో ఈ సినిమాపై ఆసక్తిని కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ హల్‌చల ్ చేస్తుంది. బలగం సినిమాలో సాయిలు అనే పాత్రలో ప్రియదర్శి నటించాడు.
ఈ సినిమాలో సాయిలు పాత్ర మొదట వేణునే చేద్దాం అనుకున్నారట.. కానీ ఆ తర్వాత ప్రియదర్శిని ఎంపిక చేశారట. ఆ పాత్ర వేణు చేసుంటే నేను మంచి సినిమాను మిస్ అయ్యేవాడిని అని అన్నారు ప్రియదర్శి. బలగం లాంటి బలమైన కథ ఉన్న సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటం సంతోషాన్ని కలిగించిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక బలగం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. పలు థియేటర్స్ లోనూ రన్ అవుతుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏదేమైన ప్రతి ఒక్కరు బలగం సినిమాకి ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడం గొప్ప విషయమే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…