Pawan Kalyan : త‌న స‌తీమ‌ణిపై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసినందుకు ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అయ్యాడంటే..!

Pawan Kalyan : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న రాజ‌కీయాల‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఉభ‌య గోదావరి జిల్లాలో తొలి విడ‌త వారాహి యాత్ర మొద‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏలూరు జిల్లాలో వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఏలూరు స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “హలో ఏపీ బైబై నినాదం మొదలు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ..ఇది అన్నది కేవలం సరదాగా ఇచ్చిన నినాదం కాదు. దాని వెనుక ఎంతో సంఘర్షణ, మథనం దాగున్నాయి అని అన్నారు.

“జగన్ విను.. నీవు చేసిన ఘనకార్యాలు విను. కల్లబొల్లి సంస్థలను పెట్టి అప్పుల కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించేలా చేశావు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.22,504 కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఈ డబ్బును దేనికోసం ఖర్చు చేశారో లెక్కలేదు. పలు నిధులు ఎటు వెళ్లాయి..? ఎవరికి ప్రయోజనం అందింది..? లెక్క చెప్పాలి అని ప‌వ‌న్ అన్నారు. ఆస్పత్రులను గాలికి వదిలేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే వికలాంగుల శాఖ కోసం రూ.537 కోట్ల బడ్జెట్ సొమ్మును వారికి రూపాయి కూడా వినియోగించలేదు. ఈ డబ్బంతా ఏమైంది..? ఎటు వెళ్తోంది..? దీనికి కచ్చితంగా జగన్ లెక్క చెప్పాల్సిందే. ఇవన్నీ ప్రజల సమస్యలు” అని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

Pawan Kalyan replied to comments on his wife
Pawan Kalyan

“వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలు. ప్రజాధనం కాపాడేందుకు, ప్రజల తరఫున జగన్ కు నేను ప్రశ్నలు సంధిస్తున్నాను. వీటికి సూటిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేకనే నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు రాని మా అమ్మను, నా భార్యను, పిల్లలను సైతం చెప్పలేని బాషలో తిడతారు. నేను ప్రజల కోసం అన్నీ పడతాను. కచ్చితంగా వీరిని వదలకుండా ప్రశ్నిస్తుంటాను” అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్, అన్నా ఎజీనోవా విడిపోయిన‌ట్టు ప్రచారం చేశారు. అలానే ప‌వ‌న్ త‌ల్లి రెల్లి కుల‌స్తురాలు అంటూ వైసీపీ నాయ‌కులు త‌ప్పుడు కామెంట్స్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

22 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago