CM YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, దివగంత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకి వెళ్లి వైఎస్సార్‌కు నివాళులర్పించారు. శ అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అంతకుముందు ఉదయం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరికివారే వేర్వేరు సమయాల్లో నివాళులర్పించేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.అయితే జగన్ తన తండ్రికి నివాళులు అర్పించే సమయంలో కొంత భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే జగన్, షర్మిళ ఇలా విడివిడిగా తన తండ్రికి నివాళులు అర్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సభ్యులందూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేవారు. సీఎం జగన్, షర్మిల మధ్య గత విభేదాలున్నప్పటికీ గతేడాది ఇద్దరూ తన తల్లితో కలిసి ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. కానీ.. ఈసారి మాత్రం ఆనవాయితీకిజగన్ పుల్ స్టాప్ పెట్టినట్టు అనిపిస్తుంది. జయంతి రోజున ఉదయం కాకుండా మధ్యాహ్న ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకోవడం కాస్త సందేహంగానే ఉంది కాగా, జగన్ పర్యటన కార్యక్రమంలో జగన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈసారి విదేశీ పర్యటనలో ఉండటం చర్చనీయంగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…