Chiranjeevi : ఇంద్ర‌భ‌వ‌నంలా చిరంజీవి ఇల్లు.. భారీ హంగుల‌తో ఎంత అందంగా ఉంది..!

Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. స్వ‌యంకృషితో ఈ స్థాయికి వ‌చ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లు సంపాదించారు. అయితే ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌తో పోటీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మ‌రోవైపు చిరంజీవి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న ఇంటిని, ఇంట్లో చేసే సంద‌డికి సంబంధించిన వీడియోల‌ని అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటిని నిర్మించుకున్న‌ విషయం తెలిసిందే. చిరంజీవి ఎంతో ఇష్టపడి ఈ ఇంటిని నిర్మించుకున్నారు.

కొత్త ఇంటిని మరిన్ని హంగులతో తీర్చిదిద్దారు . కొత్త ఇంటిని దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించి.. సకల సదుపాయాలతో పాటు, అనేక ఖరీదైన వస్తువులను ఇంట్లో సమకూర్చారు. ముఖ్యంగా బెడ్ రూమ్‌ను నగలు, ఆభరణాల తయారీలో వాడే పచ్చరాళ్లను ఉపయోగించి పెద్దగా రూపొందించారు. దీనికి తోడు ఇంట్లో ప్రత్యేకంగా ఓ పెద్ద పూజగదిని కూడా నిర్మించారు.. హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టేలా ఈ కొత్త ఇల్లు ఉంద‌ని ప‌లువురు చెప్పుకొస్తున్నారు. ఇంటి ముందు అయితే పెద్ద గార్డెన్‌లా రూపొందించుకున్నారు. కరోనా స‌మ‌యంలో చిరు ఓ వీడియో షేర్ చేయ‌గా, ఇది స్ప‌ష్టంగా క‌నిపించింది.

Chiranjeevi home tour video viral
Chiranjeevi

ఇక చిరంజీవి అనేక సేవా కార్య‌క్రమాలు కూడా చేస్తూ న‌లుగురికి అండ‌గా ఉంటున్నారు. రీసెంట్‌గా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. సినీ కార్మికులు, మెగా ఫ్యాన్స్, సినీ పాత్రికేయులు దాదాపు 2 వేల మంది వరకు ఈ క్యాంపులో ఉచితంగా పరీక్షలు చేయించుకునేందుకు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ మన్నం పర్యవేక్షణలో నిపుణులైన వైద్య బృందం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago