Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో తొలి విడత వారాహి యాత్ర మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. ఏలూరు జిల్లాలో వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభించారు. ఈ క్రమంలో ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “హలో ఏపీ బైబై నినాదం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ..ఇది అన్నది కేవలం సరదాగా ఇచ్చిన నినాదం కాదు. దాని వెనుక ఎంతో సంఘర్షణ, మథనం దాగున్నాయి అని అన్నారు.
“జగన్ విను.. నీవు చేసిన ఘనకార్యాలు విను. కల్లబొల్లి సంస్థలను పెట్టి అప్పుల కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించేలా చేశావు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.22,504 కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఈ డబ్బును దేనికోసం ఖర్చు చేశారో లెక్కలేదు. పలు నిధులు ఎటు వెళ్లాయి..? ఎవరికి ప్రయోజనం అందింది..? లెక్క చెప్పాలి అని పవన్ అన్నారు. ఆస్పత్రులను గాలికి వదిలేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే వికలాంగుల శాఖ కోసం రూ.537 కోట్ల బడ్జెట్ సొమ్మును వారికి రూపాయి కూడా వినియోగించలేదు. ఈ డబ్బంతా ఏమైంది..? ఎటు వెళ్తోంది..? దీనికి కచ్చితంగా జగన్ లెక్క చెప్పాల్సిందే. ఇవన్నీ ప్రజల సమస్యలు” అని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
![Pawan Kalyan : తన సతీమణిపై దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు పవన్ ఎలా రియాక్ట్ అయ్యాడంటే..! Pawan Kalyan replied to comments on his wife](http://3.0.182.119/wp-content/uploads/2023/07/pawan-kalyan-1-1.jpg)
“వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలు. ప్రజాధనం కాపాడేందుకు, ప్రజల తరఫున జగన్ కు నేను ప్రశ్నలు సంధిస్తున్నాను. వీటికి సూటిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేకనే నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తారు. కనీసం ఇంట్లో నుంచి బయటకు రాని మా అమ్మను, నా భార్యను, పిల్లలను సైతం చెప్పలేని బాషలో తిడతారు. నేను ప్రజల కోసం అన్నీ పడతాను. కచ్చితంగా వీరిని వదలకుండా ప్రశ్నిస్తుంటాను” అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం పవన్, అన్నా ఎజీనోవా విడిపోయినట్టు ప్రచారం చేశారు. అలానే పవన్ తల్లి రెల్లి కులస్తురాలు అంటూ వైసీపీ నాయకులు తప్పుడు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.