Pawan Kalyan OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయనకి రికార్డులు కొత్త కాదు. తన రికార్డులని తానే చెరిపేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో సూపర్ బిజీగా ఉంటూనే.. మరోవైపు వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా బ్రో ది అవతార్ అనే సినిమాతో పలకరించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ ఓజీ అనే మరో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి హంగ్రీ చీతా పేరుతో ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా, ఇది మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీ గ్లింప్స్ సంచలనంగా మారింది. స్టైలిష్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కల్యాణ్.. ఈ గ్లింప్స్‌లో కనిపించారు. యాక్షన్ ఫీస్ట్‌గా ఉన్న ఓజీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో 24 గంటల్లోనే ఈ గ్లింప్స్ రికార్డును సృష్టించింది.
ఓజీ హంగ్రీచీతా గ్లింప్స్‌కు 24 గంటల్లోనే 7.30లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్‌గా ఓజీ హంగ్రీతా రికార్డు సృష్టించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ విషయంలో తనను తానే బీట్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. ఆయన హీరోగా నటించిన భీమ్లానాయక్ గ్లింప్స్‌కు గతంలో 24 గంటల్లో 7.28లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పుడు భీమ్లా గ్లింప్స్‌ను ఓజీ హంగ్రీచీతా బీట్ చేసింది. తెలుగులో 24 గంటల్లో మోస్ట్ లైక్డ్ గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది. ఇక నేషనల్ రేంజ్‍లో మూడో స్థానంలో నిలిచింది ఓజీ గ్లింప్స్. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రైజ్ గ్లింప్స్ (హిందీ వెర్షన్)కు 24 గంటల్లోనే 12.9లక్షల లైక్స్ వచ్చాయి. అజిత్ ‘వాలిమై’ మూవీ గ్లింప్స్ 7.85లక్షల లైక్స్ దక్కించుకుంది. నేషనల్ రేంజ్‍లో ఈ రెండు మూవీస్ తర్వాత ఓజీ గ్లింప్స్ మూడో ప్లేస్‍లో నిలిచింది. ఓజీ గ్లింప్స్ వీడియో 24 గంటల్లో 7.30లక్షల లైక్స్ దక్కించుకుంది.
ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ స్టైల్, వాకింగ్‍లో స్వాగ్, యాక్షన్‍లో ఇంటెన్స్ అదిరిపోయయనే చెప్పాలి.. పవర్ స్టార్ కత్తితో నరకడం, షూట్ చేయడం గ్లింప్స్‌లో అందరిని ఆకట్టుకున్నాయి. బాంబేలో పవర్‌ఫుల్, వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు పవన్. పవర్ ఫుల్ డైలాగ్‍లతో వాయిస్ ఓవర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ గ్లింప్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి . మరాఠీలో పవన్ డైలాగ్ కూడా ఉండగా, ఇది కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…