Chandra Babu : చంద్ర‌బాబుకి ఐటీ నోటీసుల చిక్కులు.. భ‌య‌ప‌డేదే లేదంటున్న మాజీ సీఎం..

Chandra Babu : ఏపీలో ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయం రోజురోజుకి మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతుంది. చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారం ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబుపై అక్రమ మార్గంలో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టిందనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు తన పాలన సమయంలో ఓ కంపెనీ నుంచి 118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బులకు సంబంధించిన లెక్కల పైనే ఇప్పుడు ఐటీ ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబుకు ఐటీ నోటీసులపై అధికార వైసీపీ దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తుంది. అమరావతి రాజధాని పేరుతో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ నుంచి చంద్రబాబుకి నోటీసు వచ్చిన మాట వాస్తవమా, కాదో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు. రాజధాని అమరావతి పేరుతో ముడుపులు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ పత్రికలో వచ్చిన కథనాన్ని పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ… గతేడాది సెప్టెంబర్‌లోనే నోటీసు ఇచ్చినా ఎందుకు దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు లంచాల బాగోతం బట్టబయలైందని విమర్శించారు.

Chandra Babu responded on it notices
Chandra Babu

ఈ విమ‌ర్శ‌ల‌పై తాజాగా స్పందించిన చంద్ర‌బాబు.. ఆదాయపు పన్ను శాఖ నోటీసులకు ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదని, అన్నారు. ఎన్నికల సమయంలో తన పై ఇలాంటి ఆరోపణలు చేయటం సర్వసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతోందని, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బ్రహ్మండంగా విజయవంతం అయ్యాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలు జరిగినా తెలగు దేశం పార్టీ గెలుస్తుందని, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవటం తెలుగు దేశం విజయంగా అభివర్ణించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago