Posani Krishnamurali : సాంబ‌శివ‌రావు వ్యాఖ్య‌ల‌కు పోసాని కౌంట‌ర్‌.. ఏమ‌న్నారంటే..?

Posani Krishnamurali : ప్రముఖ నటుడు, రచయిత, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గ‌త కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. వైసీపీ మ‌ద్ద‌తుదారుడిగా ఉన్న ఆయ‌న చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు, ఆ చానల్ ఎడిటర్ సాంబశివరావుపై సంచలన ఆరోపణలు చేస్తూ వ‌స్తున్నారు. నేను ప్రశ్నిస్తుంటే నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. ఇవాళో, రేపో నన్ను చంపేస్తారేమో! మీడియాను ఉద్దేశించి మాట్లాడాలంటేనే భయంగా ఉంది. నాడు బీఆర్ నాయుడికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భిక్ష పెట్టారు. టీవీ5 చానల్లో ఆడవాళ్లపై జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మహిళలను తిట్టేందుకు సాంబశివరావును బీఆర్ నాయుడు టీవీ5 చానల్లో పెట్టుకున్నట్టుంది.

సాంబశివరావు మాట్లాడే భాష నీచాతినీచం. సాంబశివరావు తన ఇంట్లోని ఆడవాళ్లతో కూడా ఇలాగే మాట్లాడతారా? సాంబశివరావు వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని నాకు తెలుసు. మీడియా ముసుగులో బీఆర్ నాయుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎవరెంత బెదిరించినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా” అని పోసాని స్పష్టం చేశారు.బీఆర్ నాయుడికి చంపించడం అనేది ఏమంత పెద్ద పని కాదని అన్నారు. బీఆర్ నాయుడు టీవీ5 చానల్ పెట్టినప్పుడు ఓ వ్యక్తి దగ్గర తీసుకున్న రూ.30 కోట్లు ఇప్పటికీ తిరిగివ్వలేదని పోసాని వెల్లడించారు. డబ్బు తీసుకున్నదే కాక బెదిరింపులకు దిగారని వివరించారు. టీవీ5 సాంబశివరావు తీరు చూస్తుంటే సినీ ఇండస్ట్రీలో ఎవరినో టార్గెట్ చేసినట్టుందని అన్నారు.

Posani Krishnamurali counter to sambashiva rao comments
Posani Krishnamurali

ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడవద్దు అన్నందుకు చంపేస్తారా అని ప్రశ్నించారు. బూతులతో సమాజాన్ని ప్రశ్నించే హక్కు మీడియాకు ఏ రాజ్యాంగం ఇచ్చిందని ప్రశ్నించారు. దాన్ని తాను ఖండిస్తే అంతుచూస్తా, ఇదే నీకు లాస్ట్‌ వార్నింగ్ అంటూ సాంబశివరావు బెదిరించారన్నారు. బూతులు మాట్లాడటమే కాకుండా తెలంగాణ బిడ్డను అంటూ తెలంగాణ కార్డు వాడుకుంటున్నారని విమర్శించారు. అదేంటి అంటే జర్నలిస్ట్‌గా మాట్లాడే హక్కు ఉందని మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు సాంబశివరావు ఎక్కడ జర్నలిజం చేశారో చెప్పాలన్నారు. టీవీ5 సాంబశివరావు గతంతో పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్ కొట్టేవారని.. ఆ తర్వాత మూడు నాలుగు పెట్రోల్‌ బంకులకు యజమాని అయ్యారన్నారు. అది కూడా వైఎస్‌ఆర్‌ పుణ్యమేనన్నారు. వైఎస్ దగ్గరకు వెళ్లి కాళ్లకు దండం పెట్టి బతిమలాడుకుంటే బతుక్కోపో అని భిక్ష పెట్టారన్నారు పోసాని.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago