Pawan Kalyan : ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యరిచారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ తెలిపారు. గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. దీనిపైన 4, 5 గంటలు చర్చ జరగాలని అన్నారు. ప్రత్యేకంగా వైట్ పేపర్ విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సొమ్ములో, కొంత ఆర్ధిక శాఖ డిస్కంలకు పంపేసిందన్నారు. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనిపై పూర్తిస్ధాయి సమాధానం రానున్న సమావేశాల్లో ఇస్తానన్నారు. గత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, గాంధీ ఫొటో పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడలేదని మండిపడ్డారు.
తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు రూ.103 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. తాగునీరు, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, నీరు సరిగా లేకపోవడం, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు నిలుపుదల చేయకపోవడంతో గ్రామీణ ప్రజల జీవితం ప్రభావితం అయ్యిందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యం అయ్యిందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడం వలన మరింత నష్ట పోయాయన్నారు. గత ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పంచాయతీల విషయంలో వచ్చాయని తెలిపారు.
తాగునీరు మోటారు మరమ్మత్తులు చేపట్టకపోవడం , నీటి సరఫరా సరిగా లేకపోవడం, గ్రామ పంచాయితీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ అన్నారు.రెండు ఆర్ధిక సంఘాలు కలిపి రూ.8283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.7587కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 696 కోట్ల 28 లక్షలు పంచాయితీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయితీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటోందన్నారు పవన్ కళ్యాణ్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…