CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయకులకి చుక్కలు చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్తున్న మూడు పథకాలపై విచారణకు సిద్ధమా అని సీఎం సవాల్ విసిరారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ పడడానికి గత బీఆర్ఎస్ పాలనే కారణమంటూ ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చాలని చూసింది బీఆర్ఎస్ నాయకత్వమే అని ఆరోపించారు.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అఖరికి గొర్రెల పంపిణీ పథకంలోనూ రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారన్నారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారన్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అంతకుముందు శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రూ. 4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని.. రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలన బాగా లేదని మాటలు చెబితే సరిపోతుందని, అందుకు ఆధారాలు చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అయితే మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ బడ్జెట్‌లకు ఎటువంటి తేడా లేదని.. రెండు ప్రభుత్వాలు విలువైన భూములను అమ్మేందుకు సిద్ధం అయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. చోటా భాయ్ రేవంత్‌రెడ్డి, ప్రధానమంత్రిని కలవాలని, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమస్యల గురించి మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…