Pawan Kalyan Home In Pithapuram : పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇల్లు చూశారా..!

Pawan Kalyan Home In Pithapuram : టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్న పవన్.. తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్ధుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. దీంతో స్ధానికంగా ఉండేందుకు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారు. పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనాని ఇటీవల ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మించగా.. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని ఎంపిక చేశారు.

చేబ్రోలులో కొత్త ఇంటిని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుని.. ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంటపొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనాన్ని పవన్‌ నివాసముండేందుకు ఎంపిక చేసుకున్నారు. జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునే వరకూ ఇక్కడే ఉంటారు. ఇంటికి ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా, పిఠాపురంలో ఆయన కొత్త ఇల్లు రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan Home In Pithapuram see how it is
Pawan Kalyan Home In Pithapuram

పవన్ కార్యాలయం, వసతికి అనువుగా చేబ్రోలులో ఓ భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఉగాది రోజు పవన్ గృహ ప్రవేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ మూడంతస్తుల భవనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేనతో పొత్తులో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇక, అధికార వైసీపీ ఇక్కడ వంగా గీతను బరిలోకి దించింది. పెద్ద ఎత్తున మంత్రులు, కీలక నేతలను అక్కడ ప్రచారం కోసం మోహరించింది. అటు, అధికార వైసీపీ ఎన్ని చేసినా తాను పిఠాపురంలో గెలిచి తీరుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్నారు. ఉగాది త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇంటి నుండే త‌న రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

11 hours ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

24 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago