KA Paul : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దూసుకెళ్తున్నారు ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై విసుర్లు విసురుతూ ముందుకు సాగుతున్నారు. అయితే జగన్‌పై ఆయన ఏర్పాటు చేసిన సిద్దం సభలపై కేఏ పాల్ వేసిన పంచ్‌లు అందరిని ఆశ్చర్యపరచడమే కాక నవ్వులు పూయిస్తున్నాయి. జగన్ మీటింగ్ పెట్టి ఓడిపోవడానికి సిద్దం,అప్పులు చేయడానికి సిద్ధం, స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి సిద్ధం, మోడీకి అమ్ముకుపోవడానికి సిద్ధం అంటూ ఆయన చెబుతున్నారు అని కేఎల్ పాల్ అన్నారు.
నటులు నటులే. వారు రియల్ పీపుల్ కాదు.జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్ధానాలు నవరత్నాలు. మోడీని వణికిస్తాం అని అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్లి మసాజ్ చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాని వారు 95 శాతం నెరవేర్చినట్టు చెబుతున్నారు. ఇవన్నీ గాలి మాటలు అంటూ పాల్ పంచ్‌లు విసిరారు. ఆయన మాటలకి మాత్రం నెటిజన్స్ తెగ పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని… ఆయనకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఇటీవలే ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ స్పష్టం చేశారు.
ఇటీవల కేఏ పాల్ మాట్లాడుతూ… తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని, బాబు మోహన్ తెలంగాణలోని వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా కేఏ పాల్ పోటీపై బాబు మోహన్ మరోసారి స్పందించారు. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్‌కు 805 ఓట్లు రాగా, 2019లో నర్సాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా 281 ఓట్లు వచ్చాయి. మరిఈ సారి పాల్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడు. ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు చవిచూస్తాడు అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…