Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడీయన్ సుధాకర్. ఒకప్పుడు ఆయన తనదైన కామెడీతో ప్రేక్షకులని నవ్వించారు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తర్వాత విలన్, కమెడీ, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవికి ఆప్తమిత్రుడిగా పేరు తెచ్చుకున్నారు సుధాకర్. అప్పట్లో వెండితెరపై వీరిద్దరి కామెడీ థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుకునేవారు. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు సుధాకర్. ఈ మధ్య సుధాకర్ గురించి నెట్టింట అనేక వార్తలు ప్రచారం జరిగాయి. వాటిపై కొంత క్లారిటీ వచ్చిన కొన్నింటిపై రాలేదు. అయితే సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి ఇప్పటికీ తనను చాలా ఇష్టపడతారని సుధాకర్ చెప్పారు. ఏ అవసరం వచ్చినా కాల్ చేస్తే స్పందిస్తారని వెల్లడించారు.
“సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి, నేను ఒకే రూములో ఉండేవాళ్లం. అప్పటి నుంచి మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు. ‘యముడికి మొగుడు’ సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టారు. ఆయన కోరిక మేరకు నేను ఆ సినిమాలో నటించాను. ఈ చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది. తమిళ సినిమాల కంటే తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అందుకే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. నా కొడుకు బిన్నీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి ఆశీర్వాదాలను వాడికి ఉన్నాయి.” అని సుధాకర్ చెప్పారు.
ఇక చిరంజీవికి పద్మ విభూషణ్ రాగా,ఆయన ఓ సందర్భంలో తను ఇంత స్థాయికి రావడం తన చిన్ననాటి ఫ్రెండ్స్ అని చెప్పారు. చిన్నప్పుడే తనకి మంచి గుర్తింపు దక్కిందని, ఆ ప్రోత్సాహంతోనే తను ఈ స్థాయికి చేరుకున్నట్టు తెలియజేశారు. ఇక కమెడియన్ సుధాకర్ విషయానికి వస్తేఏ 600 పైగా చిత్రాలు.. 45 ఇయర్స్ ఇండస్ట్రీ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఏ భాషలోనైనా సక్సెస్‌ఫుల్ జర్నీ సాగించిన సుధాకర్.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసింది. ఎప్పుడూ నిండు కుండలా కనిపించే సుధాకర్.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. అసలు ఆయన్ని చూస్తే మనల్ని నవ్వించిన ఆ సుధాకర్ ఈయనేనా అన్నంతగా కమెడియన్ సుధాకర్ రూపు రేఖలు మారిపోయాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…