Aditi Rao Hydari : కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన సిద్ధార్థ్, అదితి రావు హైదరి రీసెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. మహా సముద్రం సినిమాతో అజయ్ భూపతికి, శర్వానంద్‌కు ఏం ఒరిగిందో చెప్పలేం కానీ.. సిద్దార్థ్, అదితీ రావ్‌లకి మాత్రం ప్రేమ బీజం పడింది. ఈ సినిమాతోనే వారిద్దరు ప్రేమలో పడగా, ఆ తర్వాత ఇద్దరు కలిసి చక్కర్లు కొట్టారు. అయితే వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి దేవాలయంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఉంగరాలు మార్చుకున్నారు. అయితే… అటు సిద్ధార్థ్ గానీ, ఇటు అదితి రావు హైదరి గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. మీడియాకు సమాచారం ఇవ్వలేదు. పైగా… నిశ్చితార్థం జరిగిన సమయంలో మీడియాతో పాటు ఇంకెవరినీ దేవాలయంలోకి అనుమతించలేదు.
దాంతో అందరూ పెళ్లి చేసుకున్నారని భావించారు. కాని వారిద్దరు నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నారు. అదితి రావు హైదరి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె వనపర్తి సంస్థాన వారసురాలు. వనపర్తి సంస్థానం చివరి రాజు జె రామేశ్వర్ రావు మనవరాలు. అదితి తల్లి పేరు విద్యా రావు. ఆమె హిందుస్థానీ క్లాసికల్ సింగర్. అందువల్ల, వనపర్తి సంస్థానానికి చెందిన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అదితి తన సంస్థానానికి చెందిన దేవాలయంలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వారిరివురు పెళ్లి బంధంతో ఒక్కటి కూడా కానున్నారు.
ఇక సిద్ధార్థ్‌కు గతంలో మేఘన అనే మహిళతో పెళ్లి జరిగింది. 2007లో వారిద్దరూ విడిపోయారు. అదితికి గతంలో సత్యదీప్ మిశ్రాతో వివాహం కాగా.. 2012లో విడాకులు తీసుకున్నారు. ‘మహా సముద్రం’లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వ్యక్తిగత జీవితంలో విషయం కనుక తొలుత రహస్యంగా ఉంచారు. మీడియా కెమెరా కంటికి జంటగా చిక్కడంతో అసలు విషయం తెలిసింది. పాన్ ఇండియా ఫిలిమ్స్ కల్చర్ రాకముందు హీరోగా తమిళ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లోనూ హీరోగా నటించి భారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన వయసు 44 ఏళ్లు. తన కంటే ఏడేళ్లు చిన్నదైన, హిందీ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు సినిమాల్లోనూ కథానాయికగా నటించిన అదితి రావు హైదరితో ఆయన ప్రేమలో పడ్డారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…