Pawan Kalyan : మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల అధినేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యం నుండి కాస్త కోలుకున్న తర్వాత ప్రచారం స్పీడ్ పెంచారు. అధికార వైసీపీ, సీఎం జగన్‌పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం నాడు అనకాపల్లి జిల్లాలోని నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ‘వారాహి విజయభేరి’ భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు గుప్పించారు. ‘అనకాపల్లి బెల్లం అని గతంలో వినేవాళ్లం… కానీ ఇప్పుడు అనకాపల్లి కోడిగుడ్డును వింటున్నాం. కోడిగుడ్డు పెట్టింది… గుడ్డు పొదుగుతోందని వైసీపీ నేతలు కబుర్లు చెబుతున్నారు.
వైసీపీ కోడి ఇక డిప్యూటీ సీఎంను, మంత్రిని, విప్‌ను ఇచ్చినా అనకాపల్లిలో ఒక కిలో మీటర్ రోడ్డు కూడా వేయలేక పోయారు’’ అని ఎద్దేవా చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఉద్దేశించి కోడిగుడ్డు మంత్రి అని పవన్ మాట్లాడినప్పుడలా యువకులు కేరింతలు కొట్టారు. పవన్ సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని.. .కూటమిని గెలిపించాలని పవన్‌కళ్యాణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు కానీ, ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రాజధానిగా చేశారని వైసీపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ ఓ నాయకుడే కాదని ధ్వజమెత్తారు. యువతను మత్తులోకి దించుతున్న ఈ క్రిమినల్ ప్రభుత్వాన్ని… ఎన్డీయే కూటమిగా రోడ్డుపైకి ఈడ్చి, రాష్ట్ర సరిహద్దుల్లో పడేస్తామని ధ్వజమెత్తారు.
విశాఖ జిల్లా నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రి, విప్ పదవుల్లో ఉన్నా… వారు కనీసం కిలోమీటరు రోడ్డు కూడా వేయలేకపోయారని విమర్శించారు. మద్యం, ఇసుక మీద లక్షల కోట్లు సంపాందించిన జగన్… నాయకుడు కాదని, ఓ కిరాయి వ్యాపారంటూ పవన్ ఘాటు విమర్శలు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీగా భాజపా తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను పవన్ కోరారు. పవన్ నిర్వహించిన ర్యాలీకి భారీ స్పందన లభించింది. ఎన్డీఏ శ్రేణులతో అనకాపల్లి రోడ్లు కిక్కిరిసిపోయాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…