Malla Reddy : మల్లారెడ్డి రూటే సపరేటు. ఆయన ఎప్పుడు ఏం చేసిన ప్రత్యేకత ఉంటుంది. ఆయన స్పీచ్‌లకి ఎంతో మంది ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న మల్లారెడ్డి మల్కాజిగిరి ఎంపీ సీటు గెలిచి కేటీఆర్ కు గిఫ్ట్ ఇస్తానని మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. మా నాన్న ఎన్నో నోములు నోచుకుంటే నేను పుట్టిన అన్నా.. మీరంతా నాకు దొరికారు అంటే మామూలు విషయం కాదన్నా.. ఇంత అభిమానం, ఆదరణ దొరికిందంటే మామూలు విషయం కాదన్నా.. ఎవరికీ దొరకని ఆదరణ మీ మల్లన్నకే దొరికింది. ఇది నా అదృష్టమని మల్లారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక మేడ్చల్‌లోనే ఒక వెయ్యి ఇండ్లు కూలగొట్టారు. జవహర్ నగర్‌లో 80 ఇండ్లు, ఫీర్జాదిగూడలో 150 ఇండ్లు, చీర్యాలలో 60 ఇండ్లు కూలగొట్టారు.
కాంగ్రెసోళ్లు అరాచకాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ చర్యలను చూసి పేదోళ్లు బాధపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మోసం చేశాయని ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగు, తాగునీరు, కరెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ రైతులకు కరెంట్, సాగునీరు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులకు పరిపాలన ఎలా చేయాలో అర్థం కావడం లేదు. సాగునీరు ఉన్నా ఇవ్వలేకపోతున్నారు. కరెంట్ ఉన్న ఇవ్వలేకపోతున్నారు. అన్ని ఉన్నాగానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వాళ్లు ఏ పని చేయలేకపోతున్నారు. నాలుగు నెలల్లోనే ప్రజలు చీత్కరించుకుంటున్నారు అని మల్లారెడ్డి తెలిపారు. అయితే మల్లారెడ్డి కామెంట్స్ తర్వాత మేడ్చల్ అంటనే మాస్.. మల్లన్న మారి మాస్.. కేతక్క కూడా సూపర్. ఆమె మాట్లాడుతుంటే మరింత వినబుద్ది అవుతుంది. ఆమె మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటది. మల్లా రెడ్డి మేడ్చల్‌కే పరిమితం కాకుండా.. రాష్ట్రమంతా తిరగాలి. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయన గొంతు అవసరం అని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే కేటీర్ మాటలకి వెంటనే నన్ను తొక్కేస్తున్నారే అని నవ్వులు పూయించాడు మల్లారెడ్డి. ఇక మల్లారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి ఎన్నో రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీలు ఉంటే అన్నింటికి అన్ని గెలిచారు. అయితే గెలిచింది మల్లారెడ్డి అంటున్నారు కానీ గెలిపించింది మీరు. మీరు కష్టపడితేనే 10కి 10 గెలిచాం. ఎంతో కమిట్ మెంట్ ఉంటేనే ఇది సాధ్యమైంది. మేడ్చల్‌లో బీఆర్ఎస్ బలమేందో తెలిసిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సామాజిక సేవలు చేస్తూ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లోని ప్రజలతో కలిసి మెలిసి ఉన్నారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…