CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. మరోవైపు తమపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై విరుకుపడుతూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను వెంట్రుక కూడా పీకలేరంటూ కేసీఆర్ అంటున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేకుండా లాగేయగలరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని.. తాను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డినంటూ రేవంత్ రెడ్డిని అంటూ గుర్తు చేశారు.
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అంగీలాగు ఊడదీసి.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో.. బిడ్డా అల్లుడు వస్తే ఎక్కడా పండబెట్టాలంటూ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని తెలంగాణ ప్రజలకు కట్టివ్వలేదని.. కానీ కేసీఆర్‌కు మాత్రం బిడ్డ, అల్లుడు కొడుకు అందరికి కలిసి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి.. తెలంగాణను దోపిడీ దొంగలుగా, అడవి పందుల్లా అడ్డగోలుగా దోచుకున్నారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ లలో నేను పండుకోలేదు కేటీఆర్ అంటూ ఆయనకి తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ పడుకున్నానో నేను అక్కడే ఉంటున్నా అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడించామని.. ఇప్పుడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కూడా అదే ఉత్సాహంతో ఓడించాలంటూ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి ఏం చేసిందంటూ ప్రశ్నించారు. మతం పేరిట చిచ్చుపెట్టి మూడోసారి అధికారం చేపట్టాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…