Chiranjeevi : జ‌న‌సేన కోసం చిరు సాయం.. ఏడ్చేసి కాళ్ల మీద ప‌డ్డ ప‌వ‌న్..

Chiranjeevi : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకా ప్రచారంలోకి పూర్తి స్థాయి చేయకున్నా తెర వెనుక సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అన్న మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి పవన్‌ కల్యాణ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. మెగా అన్నదమ్ములు, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ సెట్స్ లో కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని ఆశీర్వదించారు. ‘జనసేనకు విజయోస్తు, విజయీభవ’ అని చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు.

అదే సమయంలో అంజనీపుత్రుడు హనుమాన్ విగ్రహం దగ్గరే జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. సోమవారం ఉదయం పదిగంటలకు లొకేషన్ కు చిన్నన్న నాగబాబుతో కలసి లొకేషన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి, చిరంజీవి గారు ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు.

Chiranjeevi help to janasena party given to pawan kalyan
Chiranjeevi

చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో కొనసాగుతోంది. షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశానికి సోమవారం ఉదయం నాగబాబుతో కలిసి పవన్ కల్యాణ్ వెళ్లారు. రాజకీయ యుద్ధం చేస్తున్న తమ్ముడిని చిరంజీవి ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం చిరంజీవి ఆశీర్వాదం పవన్‌ పొందారు. పార్టీ స్థాపించి పదేళ్ల తర్వాత రాజకీయంగా చిరంజీవితో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు సోదరులు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు, అభ్యర్థులు, ఎన్డీయే పొత్తు వంటి అంశాలను చిరంజీవికి పవన్‌, నాగబాబు వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి కొన్ని రాజకీయ సలహాలు పవన్‌కు ఇచ్చినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల పార్టీ విరాళం ప్రకటించారు. ఆ చెక్‌ను పవన్‌, నాగబాబుకు చిరు అందించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago