Anupama Parameswaran : సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో టిల్లు స్వేర్ అనే మూవీ రూపొదింన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్ద విజయం సాధించగా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. టిల్లు స్క్వేర్ భారీ విజయం నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం నిర్వహించిన సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్‌లో అనుపమ మాట్లాడింది. అనుపమ స్టేజ్‌పైకి ఎక్కగానే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అనుపమను మాట్లాడకుండా అరుపులతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అనుపమ ఏం మాట్లాడిందంటే.. తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
సక్సెస్‌మీట్‌కు వచ్చిన ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లకు అనుప కృతజ్ఞతలు తెలిపారు. తనకు టిల్లు సీక్వెల్‌లో తనకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ అనుపమ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. అనంతరం స్టేజ్ దిగిన అనుపమ.. త్రివిక్రమ్ నుంచి ఆశీర్వాదం తీసుకుంది. ఇక ఈవెంట్ కు వచ్చిన అభిమానులు రచ్చ రచ్చ చేశారు. యంగ్ టైగర్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. అనుపమ చాలా ఆలస్యంగా రావడం ఈవెంట్ సైతం చాలా లేట్‌గా జరిగినట్టుగా కనిపిస్తోంది. అయితే స్టేజ్ మీద ఈ విషయాన్ని అనుపమ చెప్పేసింది. తన వల్ల లేట్ అయిందని, అందరినీ వెయిట్ చేయించానని, అందరూ తనను క్షమించాలని స్టేజ్ మీదే ఎంతో హుందాగా అడిగేసింది.
టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మెరిసింది. బ్లాక్ శారీ లో అనుపమ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కాస్త గ్లామర్ గా దర్శనమిచ్చింది మరో హీరోయిన్ నేహా శెట్టితో కలిసి సందడి చేసింది. టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అనుపమకు స్పీచ్ ఇచ్చే సమయంలో ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన గోలకి ఆమె ఏమి చెయ్యలేక చేతులెత్తేసింది. అనుపమ పరమేశ్వరన్ స్టేజ్ పైకి వెళ్ళి సుమ చేతిలో మైక్ తీసుకునే సమయంలో ఎన్టీఆర్ ఫాన్స్ నానా గోల చేసారు. అనుపమని అసలు మాట్లాడనివ్వలేదు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ అప్పుడే రావడంతో ఫాన్స్ నానా రచ్చ చేసారు. ఎన్టీఆర్ లేచి నమస్కారం చేస్తూ సైలెంట్ గా ఉండమని కూడా చెప్పారు. అనుపమ అయితే సరే స్టేజ్ దిగి వెళ్లిపోతానని చెప్పినా ఎన్టీఆర్ ఫాన్స్ వినలేదు, ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గోల గోల చేసేసారు. మరి స్టార్ హీరోలు ఇలా అప్పుడపుడు బయట కనబడితే వాళ్ళ ఫాన్స్ ఎంతెలా ఆవేశపడతారో అనేది టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో చూసే ఉంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…