Jr NTR : సిద్దుజొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ టిల్లు స్వేర్. ఇటీవల థియేటర్లలోకి వచ్చి వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలన విజయం సాధించిన డీజే టిల్లు సక్సెస్ మీట్ సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని కలవకముందుగా అభిమానులకు, మీడియా వారికి నమస్కారాలు తెలియజేసి తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. సిద్దూవి చాలా సినిమాలు చూశాను గానీ ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలేదని , సిద్దు లాంటి వ్యక్తులు ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారని సినిమా అంటే అతనికి అంత పిచ్చి అని అన్నారు.
టామ్ జెర్రీ,హిమాన్ వంటి క్యారెక్టర్స్ మన జీవితంలో ఎలా మిగిలాయో డీజే టిల్లు కూడా ఆ లిస్టులో చేరిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలోని డైలాగ్స్ చెప్పారు. ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తీసుకు వచ్చేటప్పుడు మేకర్స్ చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెల్ మొదటి సినిమాని మెప్పించకపోతే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ విషయం గురించే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కల కనడానికి ఒక ధైర్యం ఉండాలి. అయితే ఆ కలని నిజం చేసుకోవడానికి భయం ఉండాలి” అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందు చెప్పుకొచ్చారు.
దానికి త్రివిక్రమ్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. “కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతేగాని నేను ఇక్కడ ఉన్నానని గుర్తించండి. ఐయామ్ టెల్లింగ్ దట్. పోలె అదిరిపోలే” అంటూ అత్తారింటికి దారేది, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని డైలాగ్స్ ని మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ కి స్టేజి పైన ఉన్న సెలబ్రిటీస్, కింద ఉన్న అభిమానులు పడిపడి నవ్వుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…