Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. విశాఖలో జనసేనాని నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారంటూ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కుమార్తెను కోల్పోయిన తల్లి లత.. పవన్‌కు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయమని ఆరోజు గేటు దూకినందుకు కేసు పెట్టారని వాపోయింది. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఎందుకు రెచ్చిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారని ఆమె బాధపడుతూ చెప్పుకొచ్చింది. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధగా అనిపించిందని బాధితురాలు వాపోయింది.
మరణించిన చిన్నారి తల్లి లత మాటలకి స్పందించిన పవన్ కళ్యాణ్.. ప్రమాదం జరిగితే వైసీపీ నేతలు వెల కడుతున్నారు. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఇంకా ఏం కావాలి అని మంత్రి, ఎమ్మెల్యేలు అంటారా?, అన్నం తినేవారు ఇలా మాట్లాడతారా?, బిడ్డ చనిపోయిన కోపంతో గోడ దూకితే తల్లిపై తప్పుడు కేసులు పెడతారా?, ఈ అమానుష ఘటనపై సీఎం జగన్ మాట్లాడతారా? 150 సలహాదారులు మాట్లాడతారా?, ఇప్పటికైనా బాధితులపై ప్రభుత్వం కేసులు విత్ డ్రా చేసుకోవాలి.’’ అని పవన్ డిమాండ్ చేశారు. ప్రత్యర్థి పార్టీలను అణచివేడానికి వైసీపీ అట్రాసిటీ కేసులను వాడుతున్నారు.
ఈ కేసులను అడ్డం పెట్టుకుని స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. అన్యాయం జరిగితే పోరాటం చేయాలి.. లేదంటే తిరగబడాలి. ఉత్తరాంధ్ర విధ్వంసాన్ని అంచెలంచెలుగా చేస్తున్నారు. కరోనా సమయంలో వైసీపీ నేతలు భూములు కొల్లగొట్టారు. బాధితులకు అండగా ఉంటాం.’’ అని పవన్ భరోసా ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు. ఉత్తరాంధ్రాను కాలుష్యంతో నింపేస్తున్నారని పవన్ ఆరోపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…