Kiran Kumar : ‘డబ్బులు ఊరికే రావు..’ అనే మాటలు వినగానే మనందరిలో ఒక రూపం మెదులుతుంది. ఆయనని చూస్తే ఎవరికైన చిన్న చిరునవ్వు ముఖంపైన వస్తుంది. తెలుగు కమర్షియల్ యాడ్స్ రంగంలోనే ఓ విప్లవానికి నాంది పలికిన లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్… సినిమా, స్పోర్ట్స్ స్టార్స్, మోడల్స్ ఎవరి సాయం తీసుకోకుండా తన సంస్థకి అద్భుతమైన ప్రచారం కలిపించి తెలుగు కమర్షియల్ యాడ్స్ రంగంలోనే ఓ విప్లవానికి నాంది పలికాడు. కంపేర్ చేసి బంగారం కొనండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ కిరణ్ కుమార్ తన సంస్థకి అద్భుతమైన ప్రచారం కల్పించాడు.
తక్కువ ధరలకే నాణ్యమైన బంగారు ఆభరణాలను అందిస్తున్న లలిత జ్యువెలరీ కర్నూల్ లో తన 51వ షోరూంను పార్క్ రోడ్డు లోని మేడం కాంపౌండ్ లో శనివారం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లలిత జ్యువెలరీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు అబ్దుల్ హాఫిజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ 51 షోరూంను కర్నూలో ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్న ఆయన ప్రజలు పెద్ద మొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయవచ్చని, మార్కెట్లోనే ఇతర షోరూంలో లభించని సరికొత్త బంగారు నగల కొనుగోలు పథకంను అందిస్తున్నామన్నారు.
తను చాలా పేద కుటుంబంలో జన్మించానని, సాధారణ వ్యక్తికి సరైన ధరలో నగలు కొనడం అనేది ఓ పెద్ద ఛాలెంజ్ అన్న విషయం నాకు తెలుసు అన్నారు. నగల రంగంలో ఉచితాలు, బహుమతులు, డిస్కౌంట్ ల పేర్లతో కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటారని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు విలువ నాకు బాగా తెలుసు కనుకనే కస్టమర్లకు నేను అవగాహన కల్పిస్తుంటానని కిరణ్ కుమార్ వెల్లడించారు. నచ్చిన నగలకి ఫొటో తీసుకోండి, ఎస్టిమేట్ చేయండి, నాలుగు షాపులు కాకపోతే 40 షాపులు తిరగి కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఈ డైలాగ్ కోసమే 400 కోట్లు ఖర్చు పెట్టానని కిరణ్ కుమార్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…