Samantha : మహానటి సినిమాలో కలిసి నటించిన విజయ్, సమంత ఇప్పుడు ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు.మొన్నటికి మొన్న ఖుషి మ్యూజికల్ నైట్ లో విజయ్ దేవరకొండ- సమంత కెమిస్ట్రీ చూసి అంతా ఫిదా అయ్యారు. వేదికపై రొమాంటిక్ స్టెప్స్ తో ఆకట్టుకుంది ఈ జోడీ. ఇక ఈ ఈవెంట్ ఫొటోస్ అయితే నెట్టింట వైరల్ అయ్యాయి. సమంతని ఎత్తుకొని తిప్పడం, ఆమె కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం, వేదికపై కూడా సమంతని అదోలా చూడడం నెటిజన్స్‌కి లేని పోని అనుమానాలు తెప్పిస్తుంది. విజయ్ ఎవ్వారా ఏదో తేడాగా ఉందే అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
చిత్ర రిలీజ్ దగ్గర పడడంతో పలు ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్న విజయ్, సమంత.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒకరి ఇష్టాలను మరొకరు చెప్పారు. విజయ్ దేవరకొండ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై సమంత ఓపెన్ అయింది. విజయ్ దేవరకొండకు కాబోయే వైఫ్ చాలా సాధారణంగా ఉండాలని, ఫ్యామిలీతో కలిసిపోవాలని సమంత చెప్పింది. దీనికి విజయ్ కూడా ఎస్ అనడం విశేషం. అదేవిధంగా విజయ్ ఫోన్ కాల్స్ చాలా తక్కువగా మాట్లాడతాడని, మెసేజెస్ ఎక్కువగా చేస్తుంటాడని సామ్ చెప్పింది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా సమంత గురించి కొన్ని విషయాలు చెప్పారు.
రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన.. వీళ్ళు సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఎంత కోపంలో ఉన్నా కూడా సమంత నోట అసభ్యకర మాటలు అస్సలు రావని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అటు సమంతకు, ఇటు విజయ్ దేవరకొండకు ఈ ఖుషీ సినిమా ఎంతో కీలకంగా మారింది. సినిమాలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ పీక్స్ లో ఉంటాయని తెలుస్తుంది. ఏది ఏమైన ఈ సినిమా మాత్రం విజయ్- సమంత రిలేషన్‌పై లేనిపోని అనుమానాలని రేకెత్తిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…