Anasuya : సోష‌ల్ మీడియాకి భ‌య‌ప‌డే ర‌కాన్ని కాదు.. ఎందుకు ఏడ్చిందో వీడియోలో చెప్పిన అన‌సూయ‌..

Anasuya : ఎప్పుడు త‌న అందంతో మ‌త్తెక్కించే అన‌సూయ అప్పుడ‌ప్పుడు వివాదాల‌తోను వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. యాంక‌రింగ్‌కి గుడ్ బై చెప్పాక సినిమాలు చేస్తూ అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో వినోదం పంచుతూ ఉంటుంది. అయితే అన‌సూయ ఎవ‌రు ఊహించ‌ని విధంగా తాను గుక్క‌ప‌ట్టి ఏడుస్తున్న వీడియో షేర్ చేసి సుదీర్ఘ నోట్ పంచుకుంది. అన‌సూయ పంచుకున్న పోస్ట్‌తో ఒక్క‌సారిగా అంద‌రు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో వ‌చ్చిన నెగెటివిటీ వ‌ల్ల‌నే అన‌సూయ అంత‌గా ఏడ్చిన‌ట్టు అంద‌రు భావించారు. దీంతో ఆమె మ‌ళ్లీ రెండు వీడియోలు షేర్ చేస్తూ త‌ను ఏడ‌వ‌డానికి గ‌ల కార‌ణం చెప్పింది.

తన పోస్ట్ రాంగ్ వే లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో కార‌ణం చెప్పుకొచ్చిన అన‌సూయ‌.. దేవుడా.. ఆ వీడియో పెట్టిన తర్వాత హ్యాపీగా సెలూన్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకున్నా. ఎందుకంటే రేపు సండే నాకు వర్కింగ్ డే. ఆ వీడియోలో చాలా మంది నేను అనుకున్నట్లుగానే అర్థం చేసుకున్నారు. కానీ మిగిలిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను సోషల్ మీడియా నెగిటివిటి వ‌ల‌న‌ ఏడవలేదు.సోషల్ మీడియా వల్ల నేను ఏడ్చే రకం కాదు. నెగిటివిటి ఉంటే నా ఫీలింగ్ కోపం తో వస్తుంది. ఏడుపుతో కాదు. నా పర్సనల్ లైఫ్ లో ఒక నిర్ణయం తీసుకున్నా. అందువల్ల ఏర్పడిన వీక్ మూమెంట్ లో ఏడ్చాను. సోషల్ మీడియాలో నా లాంటి పబ్లిక్ ఫిగర్ ఏడవడం కరెక్టేనా అని ఆలోచించా. కానీ నేను ఒంటరి కాదు పర్వాలేదు అని భావించే అలా ఏడ్చినా వీడియో పోస్ట్ పెట్టినట్లు అనసూయ పేర్కొంది. ఎందుకు ఎడ్వాల్సి వచ్చిందో అని స్పష్టమైన కారణం మాత్రం అనసూయ రివీల్ చేయలేదు.

Anasuya told the reason why she cried
Anasuya

అంత‌క‌ముందు పోస్ట్‌లో నా అభిప్రాయాలను నేను ఎప్పుడూ నిక్కచ్చిగానే చెబతుంటాను. కొన్నిసార్లు నాపై ట్రోలింగ్ జరుగుతుంది.. రెండు మూడురోజులు బాధపడి తిరిగి నవ్వుతూ మీ ముందుకు వస్తున్నాను.. విశ్రాంతి తీసుకొని రీఛార్జ్ అవుతాను.. సమస్యల నుంచి పారిపోయే మనస్తత్వం కాదు నాది.. అందరి పట్ల దయగా ఉండాలని అందరినీ కోరుతున్నాను.. ఎదుటి వారు మనకు ఏం చేసినా సరే.. వారిపై దయను చూపించండి.. వారికి సమస్యలు వస్తే అండగా ఉండండి.. వాళ్లే తిరిగి మీ వద్దకు వస్తారు.. నేను కూడా ఇప్పుడు అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా..” అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐదు రోజుల క్రితం తనకు బాగా లేకపోతే.. ఇలా రికార్డ్ చేసి మెమరీగా పెట్టుకున్నానని వెల్లడించారు. అన‌సూయ ప్ర‌స్తుతం పుష్ప‌2 చిత్రంతో బిజీగా ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago