Pawan Kalyan : ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసిన ,ఎవరి నోట విన్నా కూడా బర్రలెక్క పేరే వినిపిస్తుంది. ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో కొందరు ఆమెపై దాడులకి తెగ బడ్డారు. ఈక్రమంలో బర్రెలక్క తన ఆవేదనని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఆమెకి అండగా ఉంటామంటూ పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధైర్యం అందిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, హన్మకొండ జిల్లాల బిజెపి అభ్యర్థుల కోసం ప్రచార పర్వాన్ని సాగించిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా బర్రెలక్క లాంటి వారికి తన అండ తప్పక ఉంటుందంటూ పరోక్షంగా కామెంట్ చేశారు.
ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో.. అది సాధిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే తను పదేళ్లుగా పార్టీని కొనసాగిస్తున్నానన్నారు. నాకు ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ నాడు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన వారిలో నేను ఒకడినని స్పష్టం చేశారు. ఎంతోమంది అమరుల బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం తనకు బాధను కలిగించిందని పేర్కొన్నారు.వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తానని పేర్కొన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై ఏ రోజూ మాట్లాడలేదని, కానీ ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతాను అన్నారు.
ప్రధాని పట్ల తనకి ఎంతో గౌరవం ఉందని తెలిపిన పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తర్వాత తను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నానని, వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటనలు చేస్తానని స్పష్టం చేశారు. బర్రెలక్క లాంటి వాళ్లకి తన సపోర్ట్ తప్పక ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చారు. రాను రాను బర్రెలక్కకి మద్దతు పెరుగుతూ పోతుండడంతో బీఆర్ఎస్ నాయకులలో టెన్షన్ పెరుగుతూ పోతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…